అమ్మ చెప్పిన కథలు!! పునఃకధనం- అనిల్ బత్తుల.
ఇంతకు ముందు కూడా చెప్పానొకసారి. నాకు అనిల్ బత్తుల అంటే మహా అసూయ... కుళ్ళు. ప్రాచీనాంధ్ర గ్రంధమాల పుస్తకాల విషయంలో.. జగన్మోహనరావు గారు ఏమన్నా అరుదైన పుస్తకాలు వస్తే ముందు అనిల్ కోసం దాచిపెడతారని నాకు చాలా అనుమానం.
ఇదిగో ఈ ఒక్క విషయంలో తప్ప అనిల్ అంటే చాలా చాలా అభిమానం నాకు. ఇంతకు ముందు పిల్లల కోసం సోవియట్ కథలు స్వేఛ్ఛానువాదం చేసాడు కదా. మళ్ళీ కష్టాంక. ఇప్పుడు "అమ్మ చెప్పిన కథలు " మొత్తం పదిహేను కథలు. టాల్‌స్టాయ్, ఈసోపు కథలు. ఇంకా ఒరిస్సా , రష్యన్, ఉక్రేనియా జానపద కథలు. హాయ్! చిన్నారులూ.. నేను మీ అన్నయ్య అనిల్ బత్తుల.. అని పలకరించే అనిల్‌ని చూస్తే మన మనసులు కూడా పసిపిల్లల్లా గెంతులేస్తాయి. క్లాస్,జెండర్ పెర్స్పెక్టివ్‌ల మధ్య, రకరకాల వాదాల బరువుల మధ్య ఇలాంటి సాహిత్యం జాజి, సంపెంగల పరిమళాన్ని, సున్నితత్వాన్ని, స్వఛ్ఛతను మనసుకిచ్చి హాయిగా సేద తీరుస్తుంది.
చిన్నప్పుడు నేను బాలమిత్రతో ఆడుకున్నా, చందమామతో గొప్ప స్నేహం చేసాను. బేతాళుడి ప్రశ్నలతో గొప్ప థ్రిల్. రకరకాల సొల్యూషన్స్ చెప్పుకుని ఎంజాయ్ చేసే వాళ్ళం. అవేమీ ఇప్పుడు పిల్లలకి లేవు అంటే కొంచం దిగులేస్తుంది. ఆ దిగులు తీర్చడానికి అనిల్ చేస్తున్న ప్రయత్నం చాలా చాలా గొప్పది.
అనిల్! నీ మీద గొప్ప ఆశ నాకు. మనం ఇలా చిన్నప్పుడు కథల పుస్తకాలతో స్నేహం మొదలెట్టి.. పుస్తకం ఒక తీయని, వదల్లేని అలవాటై... ఒక్కోసారి వ్యసనమైపోయి...అందులోంచి బయటకి రావాలనిపించలేకే కదా ఇప్పుడు కూడా ఎంచక్కా పుస్తకాలు చదువుకుంటున్నాం.
మన తర్వాతి తరాలు కూడా నీ కధల పుస్తకాల పునాదులతో తమని తాము నిలబెట్టుకోవాలని నాకు చాలా కోరిక గా ఉంది. ఇప్పుడు ఇలా బుజ్జి బుజ్జి కధలు చదవడం మొదలుపెట్టిన పిల్లలు.. రేపటికి అవసరమైన అన్ని సామాజిక అంశాలని అలవాటుగానే చదివి అవగాహన చేసుకుని, అర్ధం చేసుకునీ....
అసలు ఈ ఊహే చాలా చాలా అందంగా ఉంది అనిల్!!. నీకు మనస్ఫూర్తిగా అభినందనలు.
నువ్విలాంటి పుస్తకాలు చాలా తీసుకురావాలి. అమ్మ చెప్పిన కథలు ఇంతకు ముందు వచ్చిన కధలే. చందమామ లోని కుందేలు కధ నుంచి, ఏడు చేపల్లో ఎండని చేపదాకా చాలా కథలు ముందు చదివినవే.. అయితే మళ్ళీ చెప్పిన పద్ధతి చాలా సహజంగా ఉంది. అనువాదం సహజంగా, పిల్లల మనసుని హత్తుకునేటటలు ఉంది.
పిల్లలకి చెప్పడానికి మర్చిపోయిన ఈ కథలు మనం మళ్ళీ మళ్ళీ చదవాలి. చిన్న పిల్లలకి మంచి గిఫ్ట్ అవుతుంది.
కవర్ పేజ్ మీద ఒక బుజ్జాయిని రెండు చేతుల్లో పొదుపుకున్న చిత్రం భలే ఉంది. పుస్తకం చదివాక నా మనసుకూడా...

Post a Comment