చిన్ని చిన్ని చిగుర్లు...
ఈ తమలపాకు మొక్క నాలుగు నెలల క్రితం నా చిన్ననాటి స్నేహితుడు శేఖర్ తెచ్చి ఇచ్చాడు. అసలే తమలపాకు ఎంతో సున్నితం కదా. చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నా. ఎప్పుడైనా ఊరు వెళ్ళినా మా క్వార్టర్స్‌లోనే ఉండే అన్నయ్యా వాళ్ళకి చెప్పి వెళ్ళేవాళ్ళం.
మొన్న అనుకోకుండా ఒక వారం ఊరు వెళ్ళడం... ఆ సమయానికి అన్నయ్య కూడా లేకపోవడం... వచ్చేసరికి ఎండిపోయింది. దాన్ని అలా చూస్తే నా ప్రాణం కొట్టుకు పోయింది.
అప్పుడప్పుడూ అలా ఎండిన మొక్క చూసి పీకేయాలనిపించినా మనసు ఊరుకోక రోజూ నీళ్ళు పోస్తుంటే.. ఇదిగో ఈ రోజు కళకళ లాడుతూ చిన్ని చిన్ని చిగుర్లు...
ఎంత సంతోషంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. అంత చిన్న మొక్క.. బలహీనమైన తీగ.. తిరిగి చిగురించడానికి ఎంత పోరాడి ఉండాలి?? సర్వశక్తులూ కూడగట్టుకుని అది చేసిన ప్రయత్నం ఎంత గొప్పది కదా.
మనం ఎమన్నా నేర్చుకోవాలా దీన్నుంచి!! ఖచ్చితంగా కదా.. అందుకే Ben Okri ఇలా అంటాడు..
"In every moment, we are part of the infinite stories that the universe is telling us and that we are telling the universe"... మనం నేర్చుకోవాలి అంతే. రోజూ సూర్యుడు తాను అస్తమిస్తూ చంద్రుడున్నాడన్న భరోసా ఇచ్చి వెళ్తాడు. ప్రతీ అమావాస్యకీ చంద్రుడు.. ఆ చీకటి తాత్కాలికమని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు.
నేర్చుకుంటామా.. లేదా.. అది మనిష్టం.

Post a Comment