#MeToo
First they came for the socialists, and I did not speak out—
Because I was not a socialist.
Then they came for the trade unionists, and I did not speak out—
Because I was not a trade unionist
Then they came for the Jews, and I did not speak out—
Because I was not a Jew.
Then they came for me—and there was no one left to speak for me.
మాట్లాడవలసిన ప్రతీసారీ మనం తప్పించుకుని తిరిగితే చివరికి మనకోసం ఒక్కరు కూడా మిగిలి ఉండరు. ఖచ్చితంగా ఇది నిజం.
ఏదో తోచీ తోచక నాలుగు ముక్కలు రాసి దానికి కవిత్వం అని పేరు పెట్టుకున్నప్పుడూ.. వెన్నెల గురించి, సముద్రం గురించి అందంగా చెప్పుకున్నప్పుడూ... అంతా బాగానే ఉంటుంది.
కానీ ఇదిగో ఇలా జెండర్ ఇస్స్యూస్ మీద రాసినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది. లోపలా బయటా కొంత రెసిస్టెన్స్.
ప్రత్యేకించి నా మిత్రులూ, సహోదరులనుంచి..

ఎందుకంటే Basically i am a protected women. ( may be from their angle... or may be true too.)
అద్భుతమైన తండ్రీ, అర్ధం చేసుకునే సహచరుడూ, బంగారం లాంటి కొడుకూ, మంచి స్నేహితులూ..
అద్భుతమైన తండ్రీ, అర్ధం చేసుకునే సహచరుడూ, బంగారం లాంటి కొడుకూ, మంచి స్నేహితులూ..
ఒక్క మాటలో చెప్పాలంటే I am a protected soul always.. అందుకే నేను ఎప్పుడైనా violence గురించి, harassment గురించి రాస్తే వాళ్ళు కొంచం ఇబ్బంది పడతారు.
బహుశా మనం రాసే ప్రతీ అక్షరం మన అనుభవం లోంచే వస్తుందన్న ఒక Phenomenon దీనికి కారణం కావచ్చు.
కానీ ఈ రోజెందుకో రాయాలనిపిస్తోంది.
చాలా అవేదనగా. ఏంతో ప్రొటెక్టెడ్ జీవితం అనుకున్నా కూడా.. నేనిప్పటికీ చాలా సార్లు vulnerability Face చేసాను.
ఇంట్లో జరిగే హింస, అసమానత ఇవన్నీ పక్కన పెడితే... పని చేసే చోట జరిగే వేధింపులు మాత్రం చాలా భయంకరంగా పెరిగిపోతున్నాయన్నది వాస్తవం.
సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఎలా ఉన్నా. వాస్తవంగా వచ్చేటప్పటికి, చాలా కేసుల్లో సంకోచాలు, Fear Of social Defeats దాటుకుని బయటకి వచ్చేవి దాదాపు సున్నా శాతం. ఒక వేళ బయటకి చెప్పినా ఆమె క్యారెక్టర్ గురించిన చర్చలు మొదలవుతాయింక.
అదే కదా వారికి అవకాశం. సొసైటీ లో వేళ్ళూనుకున్న జెండర్ డిఫరెన్సెస్… అందులో ఒక జండర్, శతాబ్దాలుగా కేవలం ఒక వస్తువులా చూడబడుతుంటే ఇప్పుడు ఇలాంటి వాళ్లకి ఎటునుండి భయం వస్తుంది. అసలు భయమనేది వేధింపులకి గురయ్యే వారికో … లేదా భరించలేని నిజాలు తెలిసినవారు దాన్ని ఎలా వెల్లడి చెయ్యాలో తెలియని సందిగ్ధ స్థితిలోకి వెళ్ళినప్పుడో వస్తుంది.
ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి చోట స్త్రీ పురుషులు కలసి పనిచెయ్యవలసి రావటం చాలా మామూలు విషయం. జండర్ ఇష్యూ అనేది లేకుండా కేవలం సహోద్యోగుల్లా చూసే వారి మధ్య ఎలాంటి ప్రాబ్లం ఉండవు. కానీ అలా చూడటం ఒక నటన అయిన చోట, అది నటన అని ఏ ఒకరిద్దరికో అర్థమయి వారు ఆ వాతావరణంలో ఇమడలేక పోవడమూ అందరితో సోషల్ గా మూవ్ అవ్వక పోవడమూ వారి వ్యక్తిత్వలోపంగా ఎంచబడే చోట అసలు వారి బాధ ఎవరికని share చేసుకోగలరు?
అలా share చేసుకున్నా అవతలి వారు చేసేది తమ వ్యక్తిత్వ హననమే అని ముందే తెలిసివస్తున్నప్పుడు ఒక స్త్రీ తనకు తానుగా ఏమి చెయ్యగలదు?
చాలా సార్లు ఎంత గందరగోళంగా అనిపిస్తుందంటే.. ఒకేలాంటి ఒకానొక సంఘటన.. ఆమె రియాక్ట్ అయినప్పుడు.. ఆమె ఒక సంకుచిత మనస్తత్వమున్న దానిగా.. నెగెటివ్ మైండ్ గా చిత్రీకరించబడుతుంది. అదే ఆమె మౌనంగా ఉంటే అర్ధాంగీకారంగా నిరూపింపబడుతుంది.
అన్నిటికన్నా పెద్ద సమస్య.. చాలా సార్లు ఆ crookedness ని నిరూపించలేకపోవడం.

శరీరాన్ని బాధలకి గురిచెయ్యడమే హింస అని పిలవబడే సమాజంలో… అడుగడుగునా... అడుగు పెట్టిన ప్రతి చోటా మనసు మీద చేయబడే గాయాలకి అసలు పేరేం పెట్టాలి?
అన్నిటికన్నా బాధ కలిగిస్తున్న అంశం.. తాము అనుభవించిన హింసని చెప్పుకున్న బాధితుల నిజాయితీ ప్రశ్నించబడడం..
ఇన్నాళ్ళూ ఎందుకు చెప్పుకోలేదూ, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారూ అని తోటి మహిళలే వారిని ప్రశ్నించడం. ఈ ప్రాసెస్ లో ఎంతో కొంత ఎవరి సబ్జెక్టివిటీని వారు ప్రదర్శించి, తమ తమ అహాలు తృప్తి పరచుకుని, అసలు సమస్యను పక్క దోవ పట్టించడం...
తమ కన్నీటిని అర్ధం చేసుకునేవారు లేరన్న నిస్పృహతోనో, నిరాశతోనో మానసికంగా అట్టడుగుకి జారిపోతున్న మన తోటి మనిషిని ,మనం నిలబడ్డ చోటున ధైర్యంగా , ఆనందంగా చేయిచ్చి నిలబెట్టలేని రోజున, మనం సమూహ జీవులం అని నిజంగా అనిపించుకోగలమా..

Post a Comment