ఎవరి ఆట
చాలా రోజుల కిందటి మాట..
ఒక ఆర్టికల్ చదివా ఎక్కడో... సుభాషిణీ ఆలి తన సహచరమిత్రులతో కలిసి ఒక అడవిలో ఒక సర్వే కోసం వెళ్ళారట. అక్కడ వీళ్ళకి కావలసిన సౌకర్యాలు చూడడానికి వచ్చిన ఓ భూమి పుత్రికని.. "నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా (Your Eyes are like Almonds) అని అడిగారట. దానికి ఆమె అమాయకంగా తెలీదు అని సమాధాన ఇచ్చిందట. అదేంటి!! ఎప్పుడూ అద్దంలో చూసుకోలేదా అని అడిగారట వీళ్ళు. లేదు. అని చెప్పిందట ఆమె.
ఏంతో కొంత మంది మిస్ యూనివర్స్‌లని, మిస్ వరల్డ్స్ ని అందించిన భారత దేశంలో.. చాలా చాలా కాస్మెటిక్స్ వ్యాపారం జరుగుతున్న మన దేశంలో ఇది నిజ్జంగా జరిగిన నిజం. వారానికి రెండు రోజులు అడవిలో ఉండే మాలిని ఇవన్నీ ఇంకా బాగా చెప్పగలదు.
నేను దేని గురించి చెప్పదలచుకున్నానన్నది అర్ధం అయిందో లేదో నాకు తెలీదు కానీ...
నాకెందుకో ఈ రోజు Maslow's hierarchy of needs Theory గుర్తొస్తోంది.
..
1.Physiological needs
2. Safety needs
3. Social Belonging
4. Esteem
5. Self Actualisation
Abraham Maslow నే కొన్ని రోజుల తన థియరీని తర్వాత తరచి తరచి చూసుకుని.. ఇంకో కొత్త పాయింట్ కలుపుకున్నాడు.
అది Self Transcedence: the very highest and most inclusive or holistic levels of human consciousness,..
ఇంతకన్నా పెద్ద పెద్ద సమస్యలు, అసలు మన ఉనికినే నిరూపించుకోవాల్సినంత పెద్ద సమస్యలూ ఉన్నాయి కదా..
అసలు ఉన్నాడో లేడో తెలియని దేముడి దగ్గరకి .. ఎందుకింత హైరానా అనిపిస్తోంది నాకయితే.
మహిళా బిల్లు ఏమయ్యిందో తెలీదు. వయసుతో సంబంధం లేకుండా, వావి వరసలు లేకుండా ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలకి అంతెప్పుడో తెలీదు.
పని చేసే చోట కనీస వసతులు, అక్కడ జరుగుతున్న లైంగిక హింస గురించిన చట్టాలు కాయితాల్లోంచి ఆచరణలోకి ఎప్పుడోస్తాయో తెలీదు.
సరే, ఎవరి కష్టం వాళ్ళది. Maslow చెప్పినట్లు Hierarchy of needs ఇవి. కాబట్టి ఇందులో విజయం సాధించిన వాళ్ళ మీద నాకు ఎలాంటి ఆక్షేపణలూ లేవు గానీ...
ఎందుకో తెలీదు ఎవరి ఆటలో అన్నా తెలీకుండా భాగస్వాములయ్యామా అనిపిస్తోంది.. ఏమో.

Post a Comment