#గీతగోవిందం

(Are we Sensible??)
అందరికీ నచ్చిన ఓ విషయాన్ని నేను నచ్చలేదని విమర్శించ కూడదేమో..
Fear of Social Defeat!!
కానీ నచ్చలేదు మరి.
ఎందుకంటే.. అవకాశం వచ్చిన ప్రతీసారీ..దాదాపుగా ఎక్స్‌ప్లాయిటేషన్ కి గురి కాబడిన అమ్మాయిల్లో నేనూ ఒక దాన్ని.
నాకే కాదు.. ఈ దేశంలో చాలా మంది అమ్మాయిలకి ఇలాంటి అనుభవాలు ఉండి తీరుతాయి. ఇంత బాధాకరమైన, చాలా అసహ్యమైన ఒక చేదు అనుభవానికి వెకిలి రంగులద్ది, దానికి కొంత చెల్లి పెళ్ళి సెంటిమెంట్ రంగరించి తీస్తే ఆ సినిమా ఎలా హిట్ అయింది??
ఆ అమ్మాయి అంత భయంకరమైన అనుభవం తర్వాత, వైల్డ్ గా రియాక్ట్ అయింది కాబట్టి.. అన్నయ్యకి చెప్పింది కాబట్టి.. ఆ అన్నయ్య రౌడీ కాబట్టి, మన హీరో గారు కిటికీ లోంచి పారిపోయారు. 
లేకపోతే.. ఆ నికృష్టమైన ఆలోచన చెప్పిన స్నేహితుడికి ఫోన్ చేసి "ఒరే! నీ ప్లాన్ వర్క్ అవుట్ అయిందిరా.. స్నేహితుడివంటే నువ్వేరా" అని చెప్పి ఉండేవాడా..
ఆ అమ్మాయి కుటుంబంలోకే యాదృచ్ఛికంగా ఇతని చెల్లెలు వెళ్ళింది కాబట్టి.. తండ్రి ఏమయిపోతాడో అన్న భయంతోనో.. చెల్లెలి మీద ప్రేమ తోనో.. "మేడం, మేడం.. ప్లీజ్ మేడం" అని తిరిగాడు.. లేకపోతే " అది నా పిల్ల రా" అని మర్నాటి నుంచీ మళ్ళీ వెంట పడేవాడా??
బస్సులో.. తానప్పటిదాకా మర్యదస్తుడు అనుకుని,
తాగుబోతుల నుండి రక్షిస్తాడనుకుని నమ్మిన ఒక యువకుడు 
ఎడ్వాంటేజ్ తీసుకుని.. తనని ఎక్స్‌ప్లాయిట్ చేసాడన్నప్పుడు..
ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించిన అవమానం,
దుఃఖం..
ఎవరి మనసుకీ కష్టం అనిపించలేదా..
ఎందుకింత ఇన్‌సెన్సిటివ్ అయిపోయాం.

No comments