#SunRiseMusings
చీకటొకటి రాయబడ్డ మైదానంలో
చలికి వణుకుతున్న సుప్రభాతపు పాట నుండి ..
తూర్పుని వెలిగిస్తూ మొదలైన ఒక దీపపు రేఖ
ఎక్కడో పోగొట్టుకున్న ఇంద్రజాలాన్ని
కంటిపాపల్లోకి ఒంపుతూ
నవనాడుల్లోనూ ఒక రాచరికాన్ని రాస్తున్నప్పుడు ....
గోరంత కోరికల అమాయకత్వాన్ని
వదుల్చుకోవటం నేర్చినప్పుడు,
చీర చెరుగు నుండి రాలే దారాల్లా
హృదయం నుండి మొదలైన కాంతిచాపాలు
మనుషుల్ని
వెలుగు కుప్పలుగా లోకం నిండా విస్తరింపజేస్తాయి.

Post a Comment