#NatureMelodies


వాలిపోతున కొమ్మలకూ
రాలిపోతున్న ఆకులకూ
ఆకుపచ్చని సందేశమేదో తెచ్చినట్లుంది
చిలకపచ్చగా తన రెక్కలని విప్పుకుంటూ
తాను వాలిన చెట్టుకి 
ఆత్మప్రజ్వలనా మంత్రాన్ని ఉపదేశిస్తూ
ఆది గురువువై భాషించుతున్నట్లుంది 
మాటలతో పండి పోయిన 
ఈ చూడ చక్కని రామ చిలుక

No comments