స్త్రీ లేని ప్రపంచం

నిన్న చాలామంది స్నేహితులు ఒక మెసేజ్ పంపించారు. స్త్రీ లేని ప్రపంచం ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిద్దాం అని. ఆ మెసేజ్ వెనుక ఎంత బాధ, ఎంత ఆక్రోశం ఉందో కదా. మాయమై పోవాలన్న ఫీలింగ్ వెనుక ఎంత humiliation ఉండి ఉంటుంది!! ఎంత నిస్సహాయత అనుభవించి ఉంటారు. ఎంతో ప్రొటెక్టెడ్ జోన్ లో ఉన్నా... నేను కూడా కొన్ని సార్లు అవమానం ఎదురైనప్పుడు అలాంటి ఆలోచన వచ్చిన దాన్నే...
స్త్రీ లేని ప్రపంచం ఎలా ఉంటుంది?
ఒక సారి BBC Page లో మీనా కూడా ఇలాంటి ప్రశ్నే వేసింది. రాత్రి పది తరువాత పురుషులకి కర్ఫ్యూ పెట్టి బయటకి రాకూడదు అంటే అప్పుడు అమ్మాయిలంతా ఏం చేస్తారు అని. అప్పుడు పురుషులు లేని ప్రపంచం ఎలా ఉంటుంది?
అసలు ఎవరైనా సరే లేని ప్రపంచం ఎలా ఉంటుంది అన్న ఆలోచనే ఒక ఫిక్షన్ లాంటి ఆలోచనేనేమో. అలాంటి కాన్సెప్ట్స్ సినిమాలు తీసుకోవడానికి బాగుంటాయ్. నిజంగా అలాంటి పరిస్థితే ఎదురైతే? 
మనం లేకపోతే ప్రపంచం చీకటి. ఆ మాట కొస్తే ఎవరు లేకపోయినా అంతే. మనుష్యులే కాదు చెట్లూ పుట్టలూ పశువులూ పక్షులూ... సమస్త ప్రాణికోటీ ఉండాలి. వెలుగుండాలి... చీకటుండాలి. అయితే మంచే ఉండాలి. వెనుక నీడలా వచ్చి మంచిని మింగేస్తున్న చెడే ఇప్పుడు కలవరపరుస్తోంది..
ప్రతిక్షణం జీవించాలి. మనం నడచిన దారిలో మనకంటూ ఒక ముద్ర ఉండాలి. మనం ఉన్నా లేకున్నా ఈ ప్రకృతిలో ఏ మూలనో మన గొంతు ప్రకంపిస్తూ ఉండాలి. Live and let live. వీటితో పాటు మనకంటూ ఒక చిన్న స్పేస్ ఉండాలి.
మన చుట్టూ పెరుగుతున్న హింస అందమైన ఆలోచనలని బతకనిచ్చేది గానూ నిలవనిచ్చేది గానూ లేదు. 
అయినా సరే ... బాధ పడినా పోరాడదాం... ఆశ పడదాం... చీకట్లని తొలగించుకుంటూ వెలుగువైపు పయనిద్దాం.
మరి స్త్రీ లేని ప్రపంచం... పురుషుడు లేని ప్రపంచం... లాంటి ఆలోచనలే తప్పా.. అంటే కానే కాదు. 
ఇలాంటి ఆలోచనలు మనలో రావాల్సిందే...
ఆ ఆలోచనల నుండి నిజంగానే పురుషులో... స్త్రీలో... లేని ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో మనసుకు తెలిసి వస్తుంది. స్త్రీ పురుషులు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాల్సిన రక్షణా... భరోసా... మనిషి జీవితానికి ఎంత అవసరమో తెలిసి వచ్చి పరస్పరం చేసుకునే గాయాలన్నిటినీ మరిక కొనసాగకుండా చూసుకునే అవకాశమూ ఉంటుంది. 
ఎప్పుడూ ప్రశ్న పుట్టాల్సిందే... అప్పుడే కదా సమాధానం దొరికేది. 
ఎవరికి తెలుసు ఒక్క సరైన సమాధానం ప్రపంచాన్ని ఎంత సుందరంగా మార్చుతుందో...?

No comments