బోలెడు కధలున్నాయి

ఇదిగో…
ఇక్కడ బోలెడు కధలున్నాయి చూడు
ఎవరో ఎప్పుడో పారవేసుకున్నట్లున్నారు 
జాపకాల ప్రవాహాన్ని తట్టిలేపుతున్న పాటలో 
అంటుగట్టబడ్డ పల్లవీ చరణాల్లా ఉన్నట్లున్న 
ఈ హృదయాలు రెండిటిని ..
మనం పంచేసుకుందాం రా… 
నీకొకటి…
నాకొకటి... 
మనం పాటగా మారాల్సిన సమయమిది


No comments