#Kaala
కాలా..
"నికల్ నికల్ ..చల్తేరే నికల్ నికల్!!
నికల్ నికల్.... చల్తేరే నికల్ నికల్
ఇది నా కోట.. ఇక్కడికొస్తే వేట
ఒక విజిలే నే కొడితే ఇక దిగుతది పేట..
అరే సున్లే బేటా ..ఆ చూపులే తూటా నువు మళ్ళీ కనబడితే ఇక తీస్తడు తాట..
నికల్..నికల్.."
పా.రంజిత్ చెప్పదలచుకున్నది ఇదే. ఇక మిగిలినవన్నీ... ఈ మాటకి ముందూ వెనకా.. బలం కోసం, కధనం కోసం అల్లుకున్నవే.
Perception that all Matters!!
మహానటిని చూసి కదిలి కన్నీళ్ళు కార్చిన కొన్ని కళ్ళు కాలాని చూసి పెదవి విరిచాయి. బాహుబలి లో ఫార్ములా ఫార్మేట్ వెతకని సినిమా ప్రేమికులు.. కాలా లో కాన్సెప్ట్ కొత్తదనాన్ని ప్రశ్నించారు.
మహానటిలో సావిత్రి పాత్ర ఒక కంటి నుండి రెండంటే రెండు కన్నీటి బొట్లు కార్చిందని నాగ్ అశ్విన్ చెప్తే చప్పట్లు కొట్టిన జనాలు, కాలా వంటి చేత్తో రౌడీలను మట్టి కరిపిస్తే సహజత్వాన్ని, రియాలిటీని వెతుక్కున్నారు.
Perception. That's It.
ఇప్పటి సమాజం ఎలా ఉందంటే కుల వర్గ ప్రాతిపదికన చాలా సార్లు Verticalగా కొన్నిసార్లు Horizontalగా గడుల గడుల వైకుంఠపాళీ గా తయారయ్యింది.
ఎవరి కన్వీనియన్స్ ని బట్టి వాళ్ళు ఆడే సేఫ్ గేం.
కాలా సినిమా చాలా గొప్ప సినిమా అని నేను అనట్లేదు. కాని దళిత సమస్యలని పెద్దగా పట్టించుకోని మెయిన్‌స్ట్రీం సినిమా ప్రపంచానికి ఇది ఒక సమాధానం అని మాత్రం చెప్పగలను.
హీరో ఫలనా కులానికి చెందిన వాడని బాహాటంగా అతనికి పేరు పెట్టి సినిమా తీస్తున్న పరిస్థితుల్లో పా.రంజిత్ తాను చెప్ప దలచుకున్నది చాలా స్పష్టం గా చెప్పాడు. కరికాలా పేరు పెట్టడంలోనే అతని ఎత్తుగడ స్పష్టంగా అర్ధమవుతుంది
సినిమా మొత్తానికి భారతి పాత్ర అదిరిపోయింది. ఆ పిల్ల కళ్ళల్లో ధైర్యం.. నదురూ బెదురూ లేకుండా నిలబడే తీరు. చివర్లో ఆ అమ్మాయి చేస్తున్న పోరాట ధాటికి తట్టుకోలేక పోలీసులు ఆ పిల్ల ప్యాంట్ ఊడబీకేస్తే, సహజంగా వచ్చిన షాక్ కొన్ని నిముషాలు మాత్రమే, తరువాత అక్కడ దొరికిన ఒక దుడ్డుకర్ర పట్టుకుని విరుచుకుపడుతుంది..వీరబాదుడు బాదుతుంది...నాకైతే, ఇన్నాళ్ళు మానం, శీలం, పవిత్రత అంటూ పనికిమాలిన డైలాగులు కొట్టిన సినిమాలన్నిటినీ ఆ దుడ్డుకర్ర పెట్టి చితకబాదుతున్నట్టు అనిపించింది.
కొన్ని డైలాగ్స్ భలే ఉన్నాయి.
"నేల నీకు అధికారం అయితే మాకు జీవితం"
"మన తనువే మన ఆయుధం"
"కాలా అంటే కాచేవాడని అర్ధం"
చివర్లో ఎరుపూ, నీలం కలిసిన రంగులూ... నాకైతే పా రంజిత్ చాలా క్లారిటీతో ఈ సినిమా తీసాడనిపించింది.
నిజానికి సినిమాలో కొన్ని లోపాలూ ఉన్నాయి. కాలా క్యారెక్టర్ ని బేస్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. విలన్ క్యారెక్టర్ ని కూడా. ఇంతకీ అతనెవరు? ఎమెల్యే నా ఎంపి నా లేకపోతే రియల్టర్ ఆ. ఇంతకీ జరీనా ధారవీ ప్రాజెక్ట్ స్లం లో ఏం చేయడానికి వచ్చిందీ...
అయినా సరే ఇవన్నీ వదిలేద్దాం. పా.రంజిత్ రజనీ మనకు చెప్పదలచుకున్నది మాత్రం ఒకటే. భూమి పై ఎవరికి హక్కుండాలి?? మనం పుట్టి పెరిగిన భూమి, మన ఆశల్నీ, శ్వాసల్నీ మన కష్టం కార్చిన చెమటనీ కన్నీళ్లనీ ఇంకించుకున్న నేల.. మనది కాదని ఎవరన్నా అంటే.. ఏం చేయాలి??
నికల్..నికల్... అంతే..

Post a Comment