యుద్ధ కాలంలో స్వప్నాలు - బాల్య జ్ఞాపకాలు (గుగి వా ధియాంగో)
ఒక స్వాప్నికుడి ప్రపంచాన్ని మరొక స్వాప్నికుడు మన కళ్ళముందు ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నం ఎలా ఉంటుంది!!
ఇదిగో ఇలా ఉంటుంది.
ఎంతటి నియంతృత్వ రాజ్యమైనా మన అడుగుని కట్టడి చేయగలదు గాని, కలల్ని చేయలేదు కదా. అలాంటి ఒక నియంతృత్వ రాజ్యం నుంచి కలల్ని చేత బట్టుకుని వలస వెళ్ళి తన దేశం మీద వల్లమాలిన బెంగతో రాసిన ఆత్మ కధ ఇది.
చదువు మీద ప్రేమతో అష్టకష్టాలు పడి చదువుకుని నిలదొక్కుకున్న గూగి వా ధియాంగో ని, తన ఊరి నుండి రోజూ పాలు పోయడానికి వచ్చే ఒక స్త్రీ "నువ్వు పెద్ద చదువులు చదివి పెద్ద చదువులు నేర్పిస్తావట కదా- మన ఊరికి వచ్చి మన ప్రజల బతుకులు చూసి వచ్చి పాఠాలు చెప్పవచ్చుకదా. మా బతుకులు రాయవచ్చు కదా" అని అడిగింది.
అదిగో అప్పుడు మొదలయ్యింది ఆయన అసలు చదువు. అది కేవలం చదువు కాదు.. తమ జీవితాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నం.
జానపద స్వభావ సహజత్వంలోకి ప్రజా రంగస్థల చలనాన్ని ప్రవేశ పెట్టాడు గూగి. అక్కడితో ఆగకుండా తమ జానపద జీవితాని కాళ్ళు తెచ్చి, రంగులద్ది నైరోబీ నగర జీవితం ముందుకు తెచ్చాడు. తమ మూలాల ఆనవాళ్ళను పరిచయంచేసాడు.
ఆ క్రమంలో ఆయనకి రాజ్యం వేసిన సంకెళ్ళు.. ఆ తర్వాతి పరిణామాలు ఈ పుస్తకం.
ప్రొ. సాయిబాబా అనువాదం చాలా సహజం గా ఉంది.
బహుసా సాయిబాబా రాయడం వల్లన "యుద్ధ కాలంలో స్వప్నాలు" ఇంతగా మనసుని కదిలించెంత సహజం గా ఉందని అనిపించింది.
మనం అనంత మైన ఒక యుద్ధంలో ఉన్నాం.
ముఖ్యంగా సామ్రాజ్య వాదం చేస్తున్న ముప్పేట దాడిలో నిరాయుధులమై పోరాడుతున్నాం.
యుద్ధకాలం అంటేనే మృత్యుకాలం.
ఈ మృత్యు ముఖంలో తల దూర్చిన విప్లవం,
ఒక బంగారు కల కనే ప్రయత్నం చేస్తే...
ఆ కల ఎలా ఉంటుంది??
"యుద్ధ కాలంలో స్వప్నాలు" అంత స్వచ్ఛంగా ఉంటుంది.

Post a Comment