ఏడుతరాలు
HBT నుంచి గీత గారు కాల్ చేసి రూట్స్ పుస్తకాన్ని మళ్ళీ పబ్లిష్ చేస్తున్నాం. ..డిటిపీ కాపీ పంపిస్తా. ప్రూఫ్ చేసి పెట్టండి .. అన్నారు.
ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయి దుఃఖం లో మునిగిపోయి ఉన్న నాకు కొంచం డైవర్షన్ కదా. ఒక వ్యాపకం. అదీ చాలా ఇష్టమైన వ్యాపకం.
కానీ... వచ్చిన పుస్తకం ఎలాంటిది! అంతకు ముందు చాలా సార్లు చదివి, చదివిన ప్రతీ సారీ దుఃఖంలో ముంచేసిన పుస్తకం.
ప్రూఫ్ చేస్తున్న వారం రోజులూ ఎన్ని సార్లు కన్నీళ్ళతో అక్షరాలు అల్లుకు పోయాయో తెలీదు. మనకి వచ్చిందే పెద్ద కష్టం అనుకుంటాం గానీ.. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్ని కన్నీటి సాగరాలున్నాయో కదా.
కుంటా కింటే!! నా మనసు నీ పట్ల ప్రేమతో నిండి పోయింది. చదివి పక్కన పెట్టేసాక కూడా అక్షరాలు కన్నీటి అలలుగా ఇంకా నా కళ్ళముందు కదలాడుతున్నాయి. ఒకానొక భయంకర నిశ్శబ్దం మనసుని క్రూరంగా వెంటాడుతోంది.
ఆవేశం, ఆక్రోశంతో మనసు నిండిపోయింది.

ఏడుతరాలు!!
"ఏడుతరాలు" ఒక బానిసల కధ.
జాలీ దయా తెలియని అమెరికన్ల దుష్ట స్వభావానికి పరాకాష్ట!!
తమ పల్లెల్లో హాయిగా స్వేఛ్చగా ఆడుతూ పాడుతూ జీవించే ఆఫ్రికన్లను జంతువులను వేటాడినట్లు వేటాడి, చీకటి ఓడలలో అమెరికాకు బందీలుగా తీసుకువచ్చి.. బానిసలుగా చేసుకున్న అమెరికన్ల కధ ఇది.
అలా వచ్చిన మొదటి బానిస కుంటా. ఆ వంశంలో ఏడవతరానికి చెందిన అలెక్స్, తన ముత్తవ్వ చెప్పిన కధలో వాస్తవాలు తెలుసుకోవడానికి గాంబియా వెళతాడు.
అక్కడ తన తెగకు చెందిన మనుష్యులు ఇంకా అంతే స్వఛ్చంగా నాగరికతలో కలుషితం కాకుండా - ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు.
తమ తెగలో వారిని వరుస క్రమంలో పాడుకుంటూ "కుంటా" ప్రస్తావన వచ్చేసరికి అతనిని ఎవరో ఎత్తుకు పోయారని చెబుతూ ఉంటే... సాక్ష్యాలతో సహా కనిపించిన ఆనాటి దురదృష్ట సంఘటనలు తలచుకుని అలెక్స్ కన్నీరు మున్నీరు అవుతాడు.
రూట్స్ పుస్తకంలో ఒక మానవతా వాదం... ప్రతీ హృదయాన్ని సూటిగా స్పృశించే ఒక కరుణరసం ఉంది.
మతాలకీ, రంగులకి, దేశాలకి, భాషలకి అతీతమైన ఒక హృదయ స్పందన ఉంది.
జంతువుకంటే హీనంగా హింసించబడిన, గాయపడిన ఒక గుండె చప్పుడు ఉంది.
పీడన, నిర్భందం, దోపిడి, వెట్టి వాకిరీ... ఇవి సమూలంగా నిర్మూలింపబడాలి అనుకునే ప్రతీ ఒక్కరికీ "రూట్స్" ఒక ఉత్తేజం లాంటిది.
ఎన్ని సార్లు చదివినా... చదివిన ప్రతీసారి..
కెరటాలు కెరటాలుగా దుఃఖం...
జ్వాలలు జ్వాలలుగా ఆవేశం ...
ఒక్క మాటలో చెప్పాలంటే...ఆఫ్రికా దుఃఖబీడుల నేల దైన్యాన్ని చూపే పుస్తకం ఇది...

Post a Comment