జీవితాదర్శం
తాను కన్న కలలు నిజం చేసుకోవడం కోసం, అసలైన జీవితం జీవించడం కోసం ఏళ్ళకేళ్ళు, మైళ్ళకుమైళ్ళు ఎడతెరగని ప్రయాణం చేసే ప్రేమార్తుల్ని ఎవరిని చూసినా చలం గుర్తొస్తాడు నాకు.
జీవితాంతం వెతికి వెతికి.. అలసిపోయినా.. మనసులోని సహజత్వపు తడి ఏమాత్రం కోల్పోని, పసిపిల్లల్లా మెరిసే ఏ కళ్ళు చూసినా చలం గుర్తొస్తాడు.
అసలు ఒక స్త్రీ మనసు ఏం కోరుకుంటుంది!! చలం అర్ధం చేసుకున్నట్లు ఎవరైనా అర్ధం చేసుకున్నారా అనిపిస్తుంది.
చలం కి ముందూ తర్వాతా కూడా చాలా మంది అలాంటి పాత్రల్ని సృష్టించారు.
మైదానంలో రాజేశ్వరి, అరుణలో అరుణ.
మర్చిపోగలమా ఈ పాత్రల్ని! ఎలాంటి పాత్రలివి. మనసులో వేదనని మధించి మధించి, వెన్నెలతో రంగరించి మనసుకి పూతగా రాసే పాత్రలు.
ఇదిగో అలాంటిదే జీవితాదర్శంలో "లాలస".
ఈ పాత్రలన్నింటిలోనూ ఒక పోలిక ఉంది. అదేమిటంటే.. అప్పటి తమ వర్తమాన జీవితం ఎంతో భద్రతనీ, సాంఘికహోదానీ, అంతస్థునీ ఇచ్చినా.. ఈ పాత్రలన్నీ వేరేదో ఒకానొక ఆనందంకోసం.. లేదా అసలైన జీవితాన్ని జీవించడం కోసం తమ జీవితాల్లోంచి కొత్త జీవితాల్లోకి ప్రయాణించడం...
తిరిగి వెనక్కి రాలేని ఆ ప్రయాణాల్లో వారు సాధించిందేమిటి?? కోల్పోయిందేమిటి?
ఇదిగో తనకేం కావాలో.. తన జీవితాదర్శం ఏమిటో లాలస చేత చలం చెప్పిస్తున్నాడు చదవండి..
"సముద్రంలో చాపని ఎంత ప్రేమించీ నేల మీద సుఖపెట్టలేము. మీకూ నాకూ మధ్య గొప్ప ప్రేమా, శృంగారము. నాకూ ఆయనకీ మధ్య ఎన్నడూ ప్రేమలేదు. విడవలేనితనం, ఆశా, ఉద్రేకం ఇవేమీలేవు. కాని మా మధ్య గొప్ప ఐక్యం, శాంతి ఎందుకంటే ఆయన ఏ పట్టూ, ఏ ప్రెజుడీస్ లేకుండా జీవితాన్ని మధించి, సుఖపడే రహస్యాన్ని కనిపెట్టారు. మీతో వస్తే మళ్ళీ మొదలు నా హక్కుల కోసం తగాదా మర్యాదలు. బంధుత్వాలు డబ్బు, మిత్రులు. ఆయనతో తగాదా లేదు. చాలా సంతోషంగా నా అభిప్రాయాలు, నా హక్కులు, కోర్కెలు అన్నీ ఆయన చేతికి ఒప్పచెప్పాను. ఆయనలో ప్రేమకి అతీతమైన శాంతి .ఎందుకంటే ఆయనకి కోర్కెలూ భయాలూ లేవు. బాధని తప్పించుకోవడంలో నేర్పరి. కానీ బాధని చూస్తే భయంలేదు. ఆయన హృదయంలో శాంతి, ఆకాశంలో మల్లే. గొడవ పడకు. నేను రాను."
ఈ భూమి మీద ఆదర్శవంతమైన పురుషుడు కాని, స్త్రీ గాని ఉండరంటాడు చలం "జీవితాదర్శం" లో. కానీ, సమాజం అంగీకారాలూ, అనంగీకారాలూ పక్కన పెట్టి, మనసుతో జీవించి, మనసారా ప్రతీ కన్నీటి బొట్టునీ, పెదవి చివరి నవ్వునీ ఆస్వాదించి అనుభవించే ప్రతీ ఒక్క జీవితం ఆదర్శమే కదా.

Post a Comment