Free Thinking Is Strictly Prohibited!!

నీ అడుగులే కాదు
ఆలోచనలూ నిషిద్ధమిక్కడ!
నీ మాటలనే కాదు 
అక్షరాలు ఒంపిన నీ సిరా రంగు కూడా 
ప్రశ్నించబడుతుంది.
ఎందుకంటే.. ఎరుపూ, నీలం
నిషిద్ధమిక్కడ!
నువ్వు వేసే ప్రశ్నలోనే 
నీకు తెలియని తీవ్రవాదాన్ని
పరిచయం చేయబడే చోట..
నువ్విప్పుడు సుఖంగా బతకాలంటే 
నీ మాటలన్నీ గొంతులోనే మరణించాలి
బయటి మాటలన్నీ
నీ చెవుల దగ్గరే పరావర్తనం చెందాలి
రోజుకొక్క తీరుగా తీవ్రవాదపు నిర్వచనం
పుట్టుకొచ్చే చోట,
బతకాలంటే...
మౌనంగా చావడం తప్ప
మార్గమేముంది
Yes!!
Free thinking is Strictly prohibited!!


No comments