Synesthesia..

ఎదురుగా ఎంత నీరుంటేనేం..
అది గడ్డగట్టి ఉన్నంత సేపూ 
గొంతును తడుపుకునే వీలులేక 
దాహం పేరుకుపోవటమే ఆదర్శమని
నువ్వు చెప్పుకున్నప్పుడు..
ప్రశ్న ఒకటి తన అస్తిత్వాన్ని వెదుక్కున్నంత సేపూ 
క్షణానికో మాట పుట్టించగల నాలుక మాటున ,
గొంతులో కదలాడుతున్న శబ్దాలన్నీ 
నిశ్శబ్దాన్ని కప్పుకుని అక్కడే నిద్రనటిస్తున్నాయ్.
ఏ అస్తిత్వానికీ ఆచూకీగా మారకుండా 
ఏ అధికారానికీ పొలమారనీకుండా .
ప్రశ్నల పౌరసత్వం ఇక్కడ రద్దు చేయబడింది.
నీతి దాహం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.

No comments