JAMES OPPENHIEM కవిత్వం..

సముద్ర గర్భంలోకి బలంగా ఒక వల విసిరామనుకోండి...
అందులో చేపలు పడవచ్చు... రాళ్ళూ రప్పలూ పడవచ్చు!!
అదృష్టం బాగుంటే మంచి ముత్యాలూ.. పగడాలూ..ఇంకా వజ్రాలూ...
అదే ఒక పలుగూ.. పారా పట్టుకుని ఒక వజ్రాల గనికే వెళ్ళామనుకోండి! తవ్విన కొద్దీ అమూల్యమైన సంపదే...
సాహిత్యం కూడా అంతే. చదివిన వారికి.. చదివినంత.. పొందిన వారికి పొందినంత.
కొన్ని పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి. చదివిన ప్రతీ సారి కొత్త కొత్త విషయాలు నేర్పిస్తాయి. అందునా కవిత్వం అయితే ఇంక చెప్పనక్కరలేదు.
పొద్దున్న నుంచీ JAMES OPENHIEM'S కవిత్వం చదువుతున్నా..
భలే ఉంది. కొన్ని కవితలైతే మరీ...
ఇదిగో నాకు బాగా నచ్చిన కవిత..
THE SLAVE..
They set the slave free, striking off his chains...
Then he was as much of slave as ever,
He was still chained to servility,
He was still manacled to indolence and sloth,
He was still bound by fear and superstition,
By ignorance, suspicion, and savagery…
His slavery was not in the chains,
But in himself….
They can only set free men free…
And there is no need of that:
FREE MEN SET THEMSELVES FREE...
వాళ్ళు బానిసని స్వేచ్ఛగా వదిలేసారు... కానీ అతను పూర్వం ఎంత బానిసో ఇప్పుడూ అంతే.! 
ఇప్పటికీ అతనికి సంకెళ్ళు ఉన్నాయి. 
ఇంకా అతను అశ్రద్ధకి సోమరితనానికీ బానిసే.
ఎందుకంటే అతని బానిసత్వం అతని సంకెళ్ళలో లేదు. 
అతనిలోనే ఉంది.
నిజానికి స్వతంత్రుడిని ఎవరూ విముక్తి చేయనక్కరలేదు.
స్వతంత్రుడు ఎప్పుడూ తనని తానే విముక్తుడ్ని చేసుకుంటాడు..
ఎంత లోతయిన , ఎంత బలమైన హెచ్చరిక ఇది. 
నిజమే బానిసత్వం ఎక్కడుందీ... ????


No comments