#AdorableSouls!!

" అసలు నీకు, అత్తమ్మకి ఎప్పుడూ డిఫరెన్సెస్ రాలేదా"
Most adorable mother in law- అని నేను పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ చూసి ఒక ఫ్రెండ్ అడిగింది.
ఎందుకు రాలేదూ… చాలా కలతలు వచ్చాయి. చాలా అంటే చాలా… ఎంతగా అంటే విపరీతమైన నిరాశలో కూరుకుపోయి ఒక రాత్రి రైల్వేస్టేషన్ కి వెళ్లి కూర్చుని (సూసైడ్ కి మాత్రం కాదు) వచ్చి పోయే మనుషుల్ని నిస్తేజంగా చూస్తూ గడిపినంత.
ఆ తరువాత జీవితం విస్తృతమవుతున్న కొద్దీ మనసులో సంకోచాలు సంకుచితత్వాలు మాయమయ్యాక మా మధ్య స్నేహం చాలా గొప్పగా బలపడింది. అసలు చిన్నప్పటి నుండి అమ్మతో వచ్చిన గిల్లికజ్జాలు (అమ్మ పెద్ద పెర్ఫెక్షనిస్ట్) తో పోల్చుకుంటే ఇవేం పెద్దవి కావని తెలిసి , మనసు తెరచుకోవటం మొదలయ్యాక అత్తయ్య కాస్తా అత్తమ్మ అయిపోయింది.
అన్నిటికన్నా మనుష్యుల పట్ల నా స్నేహాలనీ, ప్రేమనీ, ద్వేషాన్ని… వీటికి మించి నా వ్యక్తిత్వాన్ని భరద్వాజ పుణికి పుచ్చుకుంటున్నాడని అర్థమయ్యాక మనుష్యుల పట్ల నా దృక్పధంలో చాలా చాలా మార్పు వచ్చింది.
అమ్మ, అత్తమ్మ మధ్య స్నేహం… నన్నూ… అక్కనీ… శకుంతల అక్కనీ (మా ఆడపడచు) వేరు వేరుగా అనుకోకుండా వాళ్లిద్దరూ కలసి పంచుకున్నమా బాధ్యతలూ, చూపించిన ప్రేమ… జీవితాన్ని నేను ఎలా చూడాలో నేర్పించాయి.
జీవితం ఎప్పుడూ మనం ఇచ్చేదాన్నే మరింత గొప్పగా తిరిగి ఇస్తుంది… స్నేహానికి మరింత స్నేహాన్ని… ఆత్మీయతకు మరింత ఆత్మీయతని… బహుశా ఇదే లా అఫ్ లైఫ్ ఏమో కదా…
అయితే అందరికీ ఇలా జరగాలని లేదు. అన్నిచోట్లా ఇలా ఉంటే ప్రపంచంలో ఇన్ని బంధాల్లో ఇంత దుఃఖం ఉండదు. నేనయితే మన చుట్టూ ఉన్న ఎంతోమంది ప్రేమైక జీవుల వల్లనే ఇంత ఆనందంగా ఉండగలిగా. అది మాత్రం నిజం.


No comments