#NatureMelodies

గిల్లికజ్జాల గిలిగింతలతో
కలహాల కాపురం చేస్తూ
ఎడమొహం పెడముఖమూ పెట్టుకుంటూ
నీ దారి నీది నా దారి నాది అనుకుంటూ
తడబడిన అడుగులతో ఒక్క చోటనే తిరుగుతూ
దొంగచూపుల బాణాలేసుకుంటున్నాయి..
ఏ ముచ్చటైన జంట 
పెంచుకుంటున్న జంటో ఇది
అచ్చంగా వారినే అనుకరిస్తోందనుకుంటా…!

No comments