#Che

JUNE 14th...
90 సంవత్సరాల క్రితం పుట్టి... ఇప్పటికీ తరచుగా కలల్లోకి వచ్చి, ఎన్నో కబుర్లు చెప్పి... చర్చించి, వాదించి... దారిచూపించాలని ప్రయత్నించే ఒకానొక అభిమాన నాయకుడి పుట్టినరోజు.
చెగువేరా!!
" నిజమైన విప్లవకారుడు ఎప్పుడూ ఓ అద్భుతమైన ప్రేమికుడై ఉంటాడని చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ప్రేమించే గుణాన్ని కోల్పోయిన వాడు ఎప్పటికీ గొప్ప విప్లవకారుడు కాలేడు"
. చెగువేరా తాను పాటించి .. మనకు నేర్పింది ఇదే. అతను పరిచయం అక్కర్లేని విప్లవకారుడు. ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్యవ్యతిరేక పోరాటాన్ని నడిపిన సిసలైన గెరిల్లా యోధుడు.
జీవితానికి, మరణానికి కూడా సార్ధకత ఉండాలని తపించిన అచ్చమైన మనిషి.
విప్లవ స్వప్నాలను ప్రపంచీకరించిన భావుకుడు!!
విప్లవం జీవితమంత విశాలమైనదని చాటిచెప్పిన విప్లవకారుడు....
చే వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోవడానికి అతని డైరీలు తిరుగులేని సాక్ష్యాలు..
తన స్వప్నాలనూ, నిరాశలనూ, భయాలనూ ఎప్పటికప్పుడు తన డైరీలో రికార్డు చేసాడు చే!
చే మరణించి దాదాపు అర్ధ శతాబ్దం అవుతోంది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదన్నది తిరుగులేని సత్యం. ఏ అసమానతలు రూపుమాపడం కోసం చే పోరాడాడో ఆ సమస్యలు ఇప్పటికీ మన సమాజంలో ఇంకా మిగిలే ఉన్నాయి.
అమెరికన్ సామ్రాజ్యవాదం మూడో ప్రపంచ దేశాల ప్రజలకు ప్రధాన శత్రువుగా నిలబడిన ఈ సందర్భంలో చే రచనలనూ, అతని ఉద్యమ బాటనూ మళ్ళీ కొత్తగా అధ్యయనం చేసి చర్చించాలి.
వ్యక్తిగత- రాజకీయ జీవితాల మధ్య వైరుధ్యం ఉండరాదనీ...
చావంటే భయం లేకపోవడమూ, జీవితం మీద ప్రేమ లేకపోవడమూ ఒకటి కాదనీ...
విప్లవం ఒక నిరంతర ప్రవాహమే తప్ప ఒక సాయుధ చర్యా.. ఒక విజయోత్సవమూ కాదనీ చెప్పినందుకు చేగువేరాని మనం అందరం ప్రేమించాలి!!!
చే! వి మిస్ యూ!!


No comments