Letter To My Daughter - మాయా ఏంజిలో.
2019 సంవత్సరం వస్తూ వస్తూ మయా ఏంజిలో ని వెంటబెట్టుకు వచ్చింది. మాయా రచనలు ఇంతకు ముందు చదివాను. అయినా ఇప్పుడు చదివిన సందర్భం వేరు. ఒకానొక నిరాశ జీవితాన్ని పట్టి కుదిపేస్తున్న సందర్భంలో ఒక అనువాదం కోసం చదవడం మొదలు పెట్టిన పోయెం నన్ను కుదిపేసింది. Destiny మీద చాలా నమ్మకం నాకు. అవసరం అయినప్పుడల్లా ఇలా అవసరమైన వాక్యాలు నన్ను తట్టిలేపుతుంటాయి.
మాయా భావాలు ఎప్పుడు చదివినా ఒక గొప్ప ఫీలింగ్. జీవితాంతం మనతో ఉంటానని వాగ్ధానం చేసి, మన చేయి పట్టుకుని స్నేహాన్ని, ప్రేమని, ధైర్యాన్ని Transfer చేసే ఒక నేస్తాన్ని చూస్తున్న ఫీలింగ్.
" మీరు చాలా అపజయాలు ఎదుర్కొని ఉండవచ్చు.. కానీ ఓడిపోకండి" అంటుంది మాయా. "Letter To My Daughter" చదువుతున్నంతసేపూ ఈ విశ్వమంతా మన చెవిలో చేరి నేనున్నా.. నేనున్నా అంటూ Affirmations చెప్తున్నట్లు అనిపిస్తుంది.
"Letter To My Daughter" ఈ ప్రపంచంలోని లక్షలాది మంది అమ్మాయిలతో తన ప్రేమని, తనలోని అసాధారణ పోరాట తత్వాన్ని పంచుకున్న భావాల పరంపర.
ఏడేళ్ళ ఒక పసిపాప తన తల్లి స్నేహితుడి చేతుల్లో రేప్ కి గురికావడం, 17 ఏళ్ళ వయసులో పెళ్ళికాకుండానే తల్లి కావడం.. మన ఊహల్లో కూడా తలచుకోవడానికి భయపడే కష్టాలు ఆమె ఎలా ఎదుర్కొందీ.. ఆ అనుభవాల్నించి తన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకుందీ చదివితే మనకి చాలా ప్రేరణగా అనిపిస్తుంది.
స్వాతంత్య్రం అన్న మూడక్షరాల పదం ఎంత లోతైనదో, ఎంత సంక్లిష్టమైనదో, ఎంత గంభీరమైనదో మనకి అర్ధం అవుతుంది.
మనం మనగలగకుండా ఉండడం కోసం సమస్త భౌతిక శక్తులూ, సాంఘిక శక్తులూ మన చుట్టూ ఎంత కుతంత్రం అయినా పన్ని ఉండవచ్చు.. కేవలం మనుగడ సాధించడమే ఒక గొప్ప విషయం అని అనిపించవచ్చు.. అయినా కూడా మాయా Still I Rise అన్నప్పుడు మన మనసు ధైర్యంతో ఉప్పొంగి పోతుంది.
తన ప్రతీ అక్షరంలోనూ, తన అనుభవంలోంచి వచ్చిన ప్రతీ భావంలోనూ మాయా చెప్పేది ఒక్కటే.
మీ జీవితాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించండి
దానిలో సంపూర్ణంగా నిమగ్నమైపోండి.
మీ జీవితానికి మీరు ఇవ్వగలిగినంతా ఇవ్వండి.
ఎందుకంటే..
మీరు ఇచ్చిందంతా ఖచ్చితంగా
మీ జీవితం తిరిగి ఇచ్చేస్తుంది..

Post a Comment