దోసిట చినుకులు! - ప్రకాష్‌రాజ్

ఎగిసి పడే అక్షర కెరటాలు
తమని తాము అణువణువునా వెతుక్కుంటూ
గుప్పెడు ఆశల్ని పోగుచేసుకుని
సమసమాజ పోకడలను
తీరానికి చేర్చే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది!!!
ఇదిగో దోసిట్లో ఇన్ని చినుకులు మోసుకొచ్చి ఇంత అద్భుతంగా ఉంటుంది. 
దాదాపు పదిరోజుల నుంచి వృత్తిపరమైన ఒడిదుడుకులు.. విపరీతమైన ఆశ నిరాశలు.. అదిగో ఇలాంటి నిస్పృహలో మునిగిపోయిన కొన్ని సమయాల్లో ఇలాంటి పుస్తకం ఒకటి ఖచ్చితంగా మన చేతిలో పడాలి. అసలు DesTiny అంటే ఇదే. 
ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, ధియేటర్ ఆర్టిస్ట్ ప్రకాష్‌రాజ్ గారి పుస్తకం.
నటుడిగా ప్రకాష్ రాజ్ గారు అంటే చాలా చాలా ఇష్టం నాకు. నటుడిగా కన్నా ఆయన కళ్ళల్లో కనిపించే ఒకానొక వెలుగు చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. చాలా అరుదుగా కనిపించే ఒకానొక వెలుగు. రాతిరి విచ్చుకున్న ఆకాశంలో అందాల తారలు తళుక్కున మెరిసినట్లు అనిపించే ఆ నవ్వు...
భలే ఉంది పుస్తకం. దాదాపు పాతిక వ్యాసాలు. ఆయన చేసిన సుదీర్ఘప్రయాణంలోని కొన్ని జ్నాపకాలివి. 
అనేకానేక అంశాల సమాహారం. అన్నిటికన్నా నచ్చింది ప్రతీ అంశంమీదా ఆయనకున్న అవగాహన, అది వ్యక్తం చేసిన పద్ధతి. ఎక్కడో మనల్ని మెలి పెట్టి చుట్టేసే తాత్వికత.
ఏకబిగిన చదివేసాక ఇలా అనిపించింది.
"ముసురు పట్టిన మనసు కాదిప్పుడు,
వడగళ్ళు కురిసే కన్నులు కాదిప్పుడు
తీరే ఆశల ఇగురులు చూసే సందర్భం"
సృజన్ Srujan Srujan సర్... మీ అనువాదం అద్భుతం!!


No comments