మరి… ఆ నవ్వు కన్నా


ఆకాశానికి ..
నేనే అందమని 
మేఘమనుకుంటే
నేనే వెలుగునిస్తున్నానని 
నక్షత్రమనుకుంటే
అనుకోనీ
ఏమవుతుంది…
ఆకాశం ఎప్పటి లాగే 
తన నీలి కళ్ళతో 
ఒక చిన్న నవ్వు నవ్వుతుంది..
మరి… ఆ నవ్వు కన్నా 
గొప్ప సమాధానమేముందని?


2 comments

Padmarpita said...

అనుకుంటే అనే ఊహే బాగుంది.

Uma Nuthakki said...

thanks padmarpitha garu