#UnSungMelodies-1

ఏ రోజైతే
స్త్రీ
తన అసహాయతలనుండి కాకుండా
తన సమర్ధతకి ప్రతిగా ప్రేమని
స్వీకరిస్తుందో..
ప్రేమ వల్ల తనని తాను కోల్పోకుండా
నూతనంగా ఆవిష్కరించుకోగలుగుతుందో
తనని తాను కించ పరచుకోకుండా,
నిశ్చింతగా వెల్లడి చేసుకోగలుగుతుందో
ఆ రోజున..
ఆమెకి
తన ప్రేమ
ఒక ప్రాణాంతక ప్రమాదంలా కాక
జీవన సాఫల్యతకి మూలాధారమవుతుంది. 
- Simone de Beauviour..
ఈ రోజున ప్రేమికులరోజు అనే కాదు కాని.. ఎందుకో రాయాలని అనిపించింది.
కొన్ని అనుబంధాలలో డొల్లతనాలు,
ఇంకొన్ని మోయలేని బాధ్యతలు మిగిల్చిన గాయాలు..
వదల్లేని మోహాలు,
వదులుకోలేని బలహీనతలు... ఇవన్నీ చూసాక రాయలనిపిస్తోంది.
ప్రతీ మనిషికీ ఖచ్చితంగా ప్రేమ కావాలి. 
మనిషే కాదు ఆ మాటకొస్తే ప్రతీ ప్రాణం ప్రేమని కోరుకుంటుంది. 
ప్రేమ అన్నది లేకపోతే జీవితం చాలా శూన్యంగా అనిపిస్తుంది. ఆ శూన్యాన్ని నింపుకోవడానికి... ప్రేమని వంపుకోవడానికి నిరంతరాన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది.
Pyar bina chain kaha re.. అని పాడుకోవడం బాగానే ఉంటుంది. కాని ప్రేమ వల్ల పోతున్న మనశ్శాంతుల గురించే ఇప్పుడు బాధ. మనసు కోల్పోవడం తో పాటు.. వ్యక్తిత్వం కూడా కోల్పోవడం... కోల్పోయిన తనాన్ని కూడా తెలుసుకోలేనంత చీకట్లోకి వెళిపోవడం ఇది కదా ఇప్పుడు భయ పెడుతున్న విషయం. 
ఒకరికొకరు అనుకున్నప్పుడు ఒకరు ఆస్థి.. ఇంకొకరు యజమాని అవ్వడమే అన్ని హింసలకీ మూలం కదా. ఒకరు ప్రేమనుకుంటే ఇంకొకరు హక్కు అనుకుంటారు... నేనిక్కడ ఏ జెండర్ కీ ఇది ఆపాదించట్లేదు. అన్ని బంధాలకీ చెప్తున్నా.
తప్పక కొన్ని సార్లు. తప్పించుకోలేక కొన్ని సార్లు.. మనసు ఉక్రోష పడుతున్నా... నిస్సహాయంగా మరికొన్ని సార్లు... ఇలా...
ఎవరో రాస్తున్న క్షణాల్లో మన నడక సాగినంతసేపూ మనసు గదిలోని ఘర్షణల నడత మారదు.
ప్రేమగానో.. హక్కుగానో... ఎక్కడికి పోతామన్న ధీమా తోనో.. ఏదైనాగాని ఎవరో వేస్తున్న బంధనాలు… వాటి కోసం మనం పెట్టే పరుగులు.. మనల్ని మనకి దూరం చేస్తున్న సంగతి అర్ధం కానంత వరకూ మన జీవితం ఇంతే..

No comments