తెగింపు..
(రక్తపుటడుగులు మిగిల్చిన కన్నీటి జ్ఞాపకాలు).
నేను ఇలాంటి పుస్తకం ఇప్పటి దాకా చదవలేదు. సృజన్ గారు ఈ పుస్తకం పంపినప్పుడు కవర్‌పిక్ చూడగానే కొంత కలవరం గా అనిపించింది.
చంపడం చావడం.. అది ఒక వృత్తిలా చేసి... అందులో ఫ్రొఫెషనల్సయిపోయిన మనుష్యులు ఎలా ఉంటారో నాకు ఊహకి కూడా అందని విషయం. నేనిప్పటిదాకా పెరిగిన వాతావరణంలో నాకు ఎదురు పడని కొత్త సమాజం ఇది.
All Is Well సమయాల్లోంచి.. సినిమాలు చూడడం మొదలెట్టిన కొత్తల్లోనే చూసిన సినిమా శివ.
ఆ చీకటి.. కోసేసినట్లుండే డైలాగ్స్, శివ క్యారెక్టర్ లో నాగార్జున చూపులు.. కలర్ సినిమాలో నలుపూ తెలుపూ సీన్ల మధ్యలో మెరిసిపోతున్న అమల అందమైన అల్లరి నవ్వూ.. అప్పట్లో ఆ సినిమా నాకొక అద్భుతం. మన చుట్టూ ఇలాంటి ఒక ప్రపంచం చాలా సహజంగా కలిసిపోయి ఉందని తెలిసిన క్షణం అది.
ఆ తర్వాత గాడ్ ఫాదర్ చదివాను. ఇక ఆ తర్వాత అలాంటి ఇతివృత్తాలతో ఎన్ని కధలు, ఎన్ని సినిమాలో కదా.

ఇదిగో మళ్ళీ ఈ 70 పేజీల పుస్తకం చదివాక కలిగిన సంచలనం చెప్పలేను. అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్‌లో కూసింతైనా హింస, రక్తపాతం కనిపించని కధ.
హత్య కాబోయే వ్యక్తి, హత్య చేయబోయే వ్యక్తి ఎదురుగా కూర్చుని తన మనసు పరచుకునే తీరు అద్భుతం. పుస్తకం చదువుతున్నంత సేపూ రచయిత శ్రీధర్ కళ్ళముందు కనిపిస్తారు. అతనే మన ఎదురుగా కూర్చుని మన చేతులు పట్టుకుని తడి కళ్ళతో తన కధంతా చెప్తున్నట్లు అనిపిస్తుంది.
ఒక ట్రాప్‌లో ఇరుక్కున్న ఒక యువకుడు, ఒకటి రెండు రోజుల్లో తన ప్రాణం పోతుందని తెలిసి కూడా, ఆ తీయబోయేది తన ఎదురుగా ఉన్న వ్యక్తే అని తెలిసి కూడా అంత నిబ్బరంగా ఎలా ఉన్నాడో మనకి అర్ధం కాదు.
అతను చూపించిన స్థిత ప్రజ్ఞత కరుడుగట్టిన నేరస్తుడిని కూడా పశ్చాత్తాపంలోకి నెట్టేస్తుంది. నేర ప్రపంచంలో కూడా ఉండే ప్రేమలు, స్నేహాలు, సున్నితత్వాలు, కన్నీళ్ళు.. వెరసి బయటకి రాలేని కనిపించని సంకెళ్ళు...
చంపడం మొదలెట్టిన క్షణంలోనే చావు తమ నీడైపోయిందని తెలుసుకున్న నిర్వేదాలూ..
అతను బతికితే బాగుండనిపించింది. ఇతను చంపక పోయినా బాగుండు అనిపించింది. కానీ, ఇవేం జరగలేదు. Truth is stranger than Fiction కదా. వాస్తవాలు ఇలానే ఉంటాయి
మనసుని నీరు చేసిన పుస్తకం.
ఎప్పటికైనా అగ్ని శ్రీధర్ గారిని కలవాలని ఉంది.
సృజన్ సర్!! మిమ్మల్ని కూడా.. మీ అనువాదం ఎంత గొప్పగా ఉందంటే.. నిజంగా ఈ కధ మీదే అన్నంత సహజంగా...
Thank you so much for sending this book.

Post a Comment