చిరు అలికిడి

రేయిలో మునిగిపోయిన లోకాన్ని
మెరుపు దెబ్బలు కొడుతున్న ఆకాశానికి
తన రెక్కలతో అడ్డువేద్దామనుకుందేమో
రెక్కలపై
ఆ మెరుపు మరకల వర్ణాలని
మోసుకుంటూ
ఒక సీతాకోక చిలుక
తన రెక్కల చిరు అలికిడితో
విశ్వ చైతన్యాన్ని తట్టి లేపుతోంది.. !

No comments