"పూనాచ్చి" - పెరుమాళ్ మురుగన్.
"నాకు మనుషుల గురించి రాయాలంటే భయం. దేవుళ్ళ గురించి రాయాలంటే విపరీతమైన భయం. గోవుల గురించి, పందుల గురించి వ్రాయడం నిషేదం. ఇక మిగిలినవి మేకలు, గొర్రెలు మాత్రమే. ఎటువంటి ఇబ్బందులు పెట్టని, హాని చేయని, అన్నింటికన్నా మిన్నగా చురుకైన ప్రాణి మేక మాత్రమే. అందువల్లనే నేను మేకల గురించి వ్రాయడానికి ఎంపిక చేసుకున్నాను"
- పెరుమాళ్ మురుగన్.
భలే ఉంది కదా. చదువుతుంటే ఇంకా గొప్పగా ఉంది.
Struggle for the existence
Survival of the fittest
జీవన పరిణామక్రమం అంతా ఈ రెండు సూత్రాల మధ్య తిరుగుతున్నప్పుడు... అసలు తేలిగ్గా, హాయిగా జీవించేయడం ఏ ప్రాణికైనా సాధ్యమా అనిపిస్తుంది నాకైతే. అదిగో అలాంటి ఒక జీవన రణ రంగంలో...
నిజంగా తనని బలి కోరుకుంటున్నాడో లేదో తెలియని దేవుడి దగ్గర్నించి, కాస్త ఆదమరిస్తే చాలు స్వాహా చేయాలనుకుంటున్న అడవి జంతువుల దాకా, ఒక వైపు గాయపరిచే.. మరో వైపు కడుపులో పెట్టుకుని కాపాడుకునే.. ఒకే జాతికి చెందిన రెండు వైరుధ్యాల మనుషుల దాకా.. అందర్నీ మౌనంగా తను గమనిస్తూ, ప్రశ్నిస్తూ.. మనల్ని కూడా ఆ ప్రపంచంలోకి లాక్కెళ్తుంది "పూనాచ్చి"
ప్రశ్నించకుండా ఉండిపోతున్న మనల్ని కూడా ప్రశ్నిస్తుంది.
ఇది మేక కధ అని పెరుమాళ్ మురుగన్ అంటారు గానీ, నాకైతే ఇది కేవలం మేక కధ అనిపించలేదు. రాజకీయ వ్యవస్థ మనుషులను ఏ విధంగా నియత్రస్తుందో అలవోకగా చెప్పారాయన.
Post a Comment