మంచు ఖండం
నువ్విచ్చే రాత్రుళ్ళని
తన గుండెల్లో ఉగ్గబడుతూ
నిన్నొక పగలుగా లోకానికి పరిచయం చేస్తూ
నీ సుఖాలకి తానూ హత్తుకోలు అవుతూ
తన శబ్దాలన్నిటినీ శీతలం చేసుకుంటూ
తన నిశ్శబ్దం పాదుల్లో
నీ మాటలని పెంచుకుంటూ
ఒక నల్లని పావురంగా తన రెక్కల కిందన
నీ పసి పిట్టలని కాపు కాస్తుంది
తన గుండెల్లో ఉగ్గబడుతూ
నిన్నొక పగలుగా లోకానికి పరిచయం చేస్తూ
నీ సుఖాలకి తానూ హత్తుకోలు అవుతూ
తన శబ్దాలన్నిటినీ శీతలం చేసుకుంటూ
తన నిశ్శబ్దం పాదుల్లో
నీ మాటలని పెంచుకుంటూ
ఒక నల్లని పావురంగా తన రెక్కల కిందన
నీ పసి పిట్టలని కాపు కాస్తుంది
నీ గుండెని తడపాల్సిన వర్షం మొత్తాన్ని
తన కళ్లల్లోనే నిలుపుచేస్తూ
నీలం పువ్వులా తాను మారిపోయి
నిన్నొక తెల్లకాగితంలా
లోకానికి చూపెడుతుంది
తన కళ్లల్లోనే నిలుపుచేస్తూ
నీలం పువ్వులా తాను మారిపోయి
నిన్నొక తెల్లకాగితంలా
లోకానికి చూపెడుతుంది
ఎలాంటి రోజులైతేనేం
తానొక పాలపిట్టలా నీ చుట్టూనే ఉంటుంది
లోలోపల నిండుకున్న నవ్వులన్నిటినీ
ఒక్క సారిగా తిరిగి తెచ్చుకోగలననుకునే
ఒక పిచ్చి నమ్మకంతో
తానొక పాలపిట్టలా నీ చుట్టూనే ఉంటుంది
లోలోపల నిండుకున్న నవ్వులన్నిటినీ
ఒక్క సారిగా తిరిగి తెచ్చుకోగలననుకునే
ఒక పిచ్చి నమ్మకంతో
నువ్వేం చేస్తున్నావు…
ఇంట్లో జీవంలేని పనిముట్ల మధ్యలో
తనని ఒక జీవమున్న పనిముట్టుగా చూస్తూ
బయటేమో నిన్ను నువ్వు ఎక్కువగా తూసుకుంటూ
తనని తేలికచేస్తూ
కాలాన్ని నీలాంటి వాళ్ళ మధ్య ఈడవటం తప్ప
ఇంట్లో జీవంలేని పనిముట్ల మధ్యలో
తనని ఒక జీవమున్న పనిముట్టుగా చూస్తూ
బయటేమో నిన్ను నువ్వు ఎక్కువగా తూసుకుంటూ
తనని తేలికచేస్తూ
కాలాన్ని నీలాంటి వాళ్ళ మధ్య ఈడవటం తప్ప
మరి… పనిముట్లూ మొరాయిస్తాయన్న
నిజం మరచిపోతే ఎలా
నిజం మరచిపోతే ఎలా
ఇదంతా
ఇక చాలు అనుకున్న రోజున
తనకు తాను మొరాయించి
ఒక మంచుఖండంగా ఘనీభవిస్తే
ఆ పొరల క్రిందన
కొన్ని శతాబ్దాల మౌనంగా కప్పబడిపోతావు
ఇక నిన్ను పట్టించుకునేవారెవరూ లేక
గర్భస్థం చేసుకువటానికి ఎవరూ ముందుకు రాక ..
ఇక చాలు అనుకున్న రోజున
తనకు తాను మొరాయించి
ఒక మంచుఖండంగా ఘనీభవిస్తే
ఆ పొరల క్రిందన
కొన్ని శతాబ్దాల మౌనంగా కప్పబడిపోతావు
ఇక నిన్ను పట్టించుకునేవారెవరూ లేక
గర్భస్థం చేసుకువటానికి ఎవరూ ముందుకు రాక ..
Post a Comment