ఆనంద మంత్రం
అప్పుడప్పుడూ
ఒక చిన్ని పాటలో మూటగట్టుకుని వస్తావే
అడవిపూల మీద లేఎండలో
వళ్లు వెచ్చబెట్టుకుంటున్న మెత్తని గాలినీ...
ఆకు పచ్చని మైదానపు మెలకువపై
గరిక పోచ దాచుకున్న ఆత్మస్తైర్యపు విన్యాసాన్నీ...
అప్పుడనిపిస్తుంది
నా ఆనందం నేను ఆర్జించుకునే శాశ్వతత్వంలో
దేహాలూ ఆకారాలు నిమిత్తమాత్రమని…
ప్రకృతి ప్రాకారాలే సమస్త మంత్రమని
ఒక చిన్ని పాటలో మూటగట్టుకుని వస్తావే
అడవిపూల మీద లేఎండలో
వళ్లు వెచ్చబెట్టుకుంటున్న మెత్తని గాలినీ...
ఆకు పచ్చని మైదానపు మెలకువపై
గరిక పోచ దాచుకున్న ఆత్మస్తైర్యపు విన్యాసాన్నీ...
అప్పుడనిపిస్తుంది
నా ఆనందం నేను ఆర్జించుకునే శాశ్వతత్వంలో
దేహాలూ ఆకారాలు నిమిత్తమాత్రమని…
ప్రకృతి ప్రాకారాలే సమస్త మంత్రమని
Post a Comment