రూపాంతరం
గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారటమన్న రూపాంతరాన్ని మనం అమోదించగలిగినట్లు అదే సీతాకోకచిలుక గొంగళిపురుగు పురుగుగా రూపాంతరం చెందితే ఆమోదించగలమా? అలా అమోదించగలిగింత మేలిమి వ్యక్తిత్వాలు ఈ లోకంలో వచ్చేరోజు వరకూ, మనలో ఈ ‘రూపాంతరం’ కలుగచేసే అలజడి మాత్రం అమేయం.
కొన్ని కథలు ఎప్పుడూ చదివే కథల్లా ఉండవు. కథ వెనుక చెప్పబడిన కథ (కథలు అనాలేమో) ఎవరెవరి మనఃస్థితి ని బట్టి వారికి చేరువవ్వటం ఎన్ని సార్లు జరుగుతుంది??
. అలా రాయగలగాలంటే అంతర్లీనంగా రచయిత మనసులో ఎన్ని వేల పాత్రల సంఘర్షణ కొనసాగుతూ ఉండాలి!! అలాంటి రచయితలు అసలు ఎందరుంటారు?
ఎందరుండనీ… అలాంటి రచయిత పేరు ఒకటి చెప్పాల్సి వస్తే మొదటగా మనకి స్ఫురించే పేరు ఫ్రాంజ్ కాఫ్కా.

అలాంటి రచనల్లో మొదటగా చెప్పుకోవాల్సింది ఫ్రాంజ్ కాఫ్కా రాసిన ‘మెటామార్ఫసిస్’ పుస్తకాన్ని. దీన్ని తెలుగులో ‘రూపాంతరం’ పేరుతో మెహర్ అనువదించారు.
ఒక రూపాంతరం ఒక మనిషిని - మనిషి రూపంలో కనపడని ‘అంతరాల” ని ఏ విధంగా బయట వేస్తుందో మనకి అనుభవమయ్యే కథ ఇది.
ఇందులో కథగా చెప్పాలంటే ఏమీ ఉండదు… గ్రెగర్ జమ్జా అనే ఒక సేల్స్ మాన్ రాత్రికి రాత్రి ఒక కీటకంగా మారిపోవటంతో ఆతని కుటుంబ దృశ్యం ఏ విధంగా విధంగా రూపాంతరం చెందింది అన్నదే ఈ పుస్తకం. అలా కీటకంగా మారే అతనికి తన ఇంట్లో అమ్మా, నాన్న, చెల్లి అప్పుడప్పుడూ పనిమనిషి, చివరిలో & ఇంట్లో అద్దెకి దిగిన కుర్రవాళ్ళ మధ్య జరిగిన రోజువారీ అనుభవాలే ఈ కథ. …
“ గ్రెగర్ జమ్జా ఒక ఉదయం కలత కలల్నించి నిద్ర లేచే సరికి, మంచంపై తానో ఒక పెద్ద కీటకంగా మారిపోయి ఉన్నాడని గమనించాడు.” అనే వాక్యంతో మొదలయ్యే ఈ పుస్తకం అడుగడుగడుగునా మనలో నిక్షిప్తమై ఉన్న ఎన్నో భావాలని కుదిపేస్తుంది.
నువ్విప్పుడు ఏదీ చేయలేని తనంలో ఉంటే నీ వాళ్లకి నువ్వెంత? అన్న ప్రశ్నకి ఒక సమాధానంలా అనిపిస్తుంది.
ఇక్కడ కీటకంగా మారటం అనేదాన్ని ఒక నిస్సహాయత కి ప్రతీక గా తీసుకుంటే… మనకి ఎంత దగ్గరి వాళ్ళైనా సరే ఆ సమయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారో అన్న విషయం ఎత్తి చూపినట్లు అనిపిస్తుంది.
నువ్వైనా, నేనైనా లేదా ఇంకెవరైనా సరే ఇప్పటి వరకూ మనమెలా కనిపించామో అలా కనిపిస్తేనే ప్రపంచం ఆమోదిస్తుంది మన మీద ఏర్పరచుకున్న తమ అభిప్రాయాల పరిధిలోనే మనమున్నామన్న సంతోషం ప్రపంచానిది. వాళ్ళ అభిప్రాయాల్ని చెల్లాచెదురు చేసేలా మనం మారామా దాన్ని ఆమోదించటానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. అది మంచైనా చెడు అయినా…
ఈ పుస్తకం నిండా చెప్పబడింది అదే… ఎక్కడా మనిషి అంతరంగాన్ని తొలచి మాటలు రాసినట్లు గానీ, అద్భుతమైన మానసిక విశ్లేషణ చేసినట్లు గానీ ఉండదు, కానీ తాను తీసుకున్న ప్రతీకని బట్టి మనమే దీనిలో ఉన్న ఆంతర్యం ఏమిటీ అని మనల్ని మనం తొలుచుకుంటూ వెళ్లేలా చేస్తుంది ఈ ‘రూపాంతరం’

Post a Comment