#116, Vuda Park, Visakhapatnam
#116,
Vuda Park,
Visakhapatnam
Vuda Park,
Visakhapatnam
ఈ Address ఎవరిదనుకుంటున్నారా!!
మీరే చదవండి.
పచ్చటి పరిసరాలు,
అప్పుడే నెమ్మదిగా అరుణ పుష్పంలా విచ్చుకుంటున్న సూర్యుడూ ,
మెత్తగా కోస్తున్న మంచు గాలీ..
రక రకాల వింత వింత జనాలు…
మీరే చదవండి.
పచ్చటి పరిసరాలు,
అప్పుడే నెమ్మదిగా అరుణ పుష్పంలా విచ్చుకుంటున్న సూర్యుడూ ,
మెత్తగా కోస్తున్న మంచు గాలీ..
రక రకాల వింత వింత జనాలు…
అక్కడ జనాలంతా ఎవరి ప్రపంచంలో వాళ్ళున్నారు. శరీరం బరువునుని దించుకోవటానికి కొందరు పరిగెడుతుంటే మనసు భారం తట్టుకోలేనట్లు కొందరు నెమ్మదిగా నడుస్తున్నారు.
వీళ్ళందిరి మధ్య తదేక ధ్యానంతో వాటిపని అవి చేసుకుంటూ పోతున్నాయి ఆ చిలుకలు.
నిన్న భరధ్వాజ్ వుడా పార్క్ కి వెళ్లి వాటి ఇంటి గురించి చెప్పాడు. వాడితో పాటు ఈ రోజు నేనూ అక్కడకి ఛలో మని పరిగెత్తాను. వుడా పార్క్ లో ప్రతి చెట్టుకీ ఒక నెంబర్ ఉంటుంది. 123, 122, 121… అలా వెదుక్కుంటూ వెళుతుండగానే దూరంగా చిలకల గొంతు వినిపించింది.
అక్కడికి వెళ్లి చూద్దుము కదా! అక్కడ బ్రహ్మాండమైన construction వర్క్ జరుగుతోంది. నాలుగు గదులు. మన భాషలో చెప్పాలంటే డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ అనాలేమో.. శ్రద్ధగా తొలచి తొలచి కట్టుకుంటున్నాయి. ఒక మగ చిలుక ఒక ఆడ చిలుక. కొంచెం తొలచిన ప్రతిసారీ… ఒకసారి లోపలి వెళ్లడం. ఫ్రీ మూవ్‌మెంట్ చెక్ చేసుకోవడం. వాటి భాషలో ఎదేదో గోల గోలగా అరుచుకోవడం, … మళ్ళీ బయటకి వచ్చి ముక్కుతో షేప్ చేసుకోవడం. చూడడానికి రెండు కళ్ళూ చాలలేదు మాకు.
వాటి కష్టం అవి పడుతూ వాటి లైఫ్ ని అవి డిజైన్ చేసుకోవడం భలే నచ్చింది నాకు. మనమేదో మనం మాత్రమే బుద్ధి జీవులం అనుకుంటాం కానీ… ప్రకృతిలో చాలా జీవులు మనకి ఏవో విలువైన పాఠాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లే అనిపిస్తుంది.. చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకూ, గరిక నుండి వటవృక్షం వరకూ చాలా నేర్పిస్తాయి మనకి.
చీమలే కదా అనుకుంటాం మనం, అవి తమకన్నా 10 నుంచి 50 రెట్ల బరువునైనా ఇట్టే మోయగలవట. క్రమశిక్షణలోనూ, ఐకమత్యంలోనూ, భవిష్యత్ అవసరాలకోసం ఆహారాన్ని నిలువ చేసుకోవటం లోనూ వాటికి అవే సాటి. ఇక సివిల్ ఇంజనీరింగ్ లో మనిషి ఊహకందని అద్భుతాలు ఇవి చేస్తూ ఉంటాయి.
ప్రతి జీవి తమదైన శైలిలో కూడు… గూడు… ఆత్మరక్షణ కోసం తన ఏర్పాట్లు తాను చేసుకుంటూనే ఉంటుంది. నేర్చుకోవాలే కానీ మనిషి అంతేవాసిత్వమన్నది ఎప్పటికీ ముగియని అన్వేషణే.
పైన ఇచ్చింది నేను చూసిన చిలకల ఇంటి అడ్రెస్స్.
మీ మీ చుట్టూ పక్కల ఇలాంటివి ఎన్నో ఉండే ఉంటాయి… రొటీన్ నుండి దూరంగా వెళ్లి ఒక్క సారి పరిసరాల్ని గమనించండి… బాల్యంలో ఫ్రీజ్ అయిన సంతోషమేదో మనసుని తడుతుంది. ఆ సంతోషపు చిరునామా ఒక గడ్డి పువ్వే అవ్వొచ్చు… ఒక్క వాన చినుకే అవ్వొచ్చు. కానీ చిరునామా దొరకటం మాత్రం తథ్యం
Post a Comment