మనం


ఎండమావులు కదలాడుతున్న దారిలో
నీటిచెలమల స్పర్శ తాకిందంటే
అది నువ్వు మొదలైన సవ్వడే
మౌనం నాటిన తావులో
మాటలు పండుతున్నాయంటే
అది నువ్వు పైరుగా మారిన ముచ్చటే
వలస వచ్చిన కలలలో
నవ్వులు వినవస్తున్నాయంటే
అది నువ్వొక స్వప్న మైదానమైన సందడే
నువ్వంటే మరేంకాదు
నేనల్లుకున్న 'మనం'
నేనందుకున్న 'కావ్యం'

No comments