బంతిపూల వనంలో

బంతిపూల వనంలో ఎగిరే
పసి తుమ్మెదల్లా...
నీలినీలి కొలనుల్లో
చురుగ్గా ఎగిరే చేపపిల్లల్లా..
ఎర్రరిబ్బన్‌తో తనూ,
పచ్చ నిక్కర్‌తో వాడూ..
అల్లిబిల్లిగా.. వడగళ్ళేరుకుంటూ,
ఆడుకుంటున్నప్పుడు..
ఎవరి పెదవుల ఆకాశాన
ఎవరు నవ్వుల ఇంధ్రదనస్సో
అర్ధంకాక..
అలా
చూస్తుండిపోతా!!
ఒక్కోసారి కాలం గడపడానికీ..
మరోసారి కాలాన్ని మర్చిపోయీ..

-      14.12.15


No comments