అపవిత్రం


మృదువైన నవ్వుపై నువ్వు చేసే గాయమొకటి 
నీ మనసు మీద రాచపుండై మొలిచే తరుణం
పరిచయమయినప్పుడు 
ఎలా మొదలయ్యావో ఆత్మావలోకన చేసుకున్నా 
నీ ముగింపు మాత్రం ఏకాకితనమే
మౌనం కప్పుకుంటున్నవాటన్నిటికీ 
మాటే రాదనుకుని 
నువ్వు చేసే పిచ్చి శబ్దాలు ఉన్నాయి చూశావూ
అవే ప్రతిధ్వనులుగా మారి 
నీ కర్ణభేరిని ఛేదించడమే 
రేపటి రోజున నీ చెక్కిళ్ళపై చిత్రించబడే రక్తదృశ్యం
నీకు నువ్వు వక్రీకరించుకునే ఏ స్నేహితాలలోనో 
ఇమడటానికి స్నేహమేమీ అపవిత్రపు పొత్తుకాదు
నువ్వెన్ని మేలిముసుగులు కప్పుకోగాక 
మనసుపై నువ్వు చల్లుకున్న కొన్ని దుర్గంధాలు 
నిన్ను నిన్నుగా పట్టించేస్తాయ్ 
నిజ స్నేహపు పవిత్రత ముందు
నువ్వెప్పుడూ పిపీలకమే.


No comments