వనవాసి – బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ

ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ మనదేశంలోకి ప్రవేశించి ప్రజల ఆర్ధిక, సాంఘిక పరిస్థితులలో సంక్షోభాన్ని సృష్టిస్తున్న సందర్భంలో, కాలుష్య భూతం భూగోళాన్ని కబళించడా నికి పొంచి ఉన్న తరుణంలో, కుల, మత,


వర్గ, ప్రాంతీయ వైరుధ్యాలతో మనిషి ఘర్షణ పడుతూ ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న సమయంలో, స్వచ్ఛమయిన ప్రాణవాయువును -  అతి స్వచ్చమయిన అరణ్య వృక్షాల మీద నుంచి, సభ్యసమాజపు నాగరికత సోకని అరణ్యవాసుల స్వఛ్ఛమయిన జీవితాలనుండి మనకందించే నవల బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ వ్రాసిన  వనవాసి.
బిభూతిభూషణ్‌ అనగానే పాఠకుల మనసులో పథేర్‌ పాంచాలి మెదులుతుంది. సత్యజిత్‌రే తన చిత్రం ద్వారా పధేర్‌ పాంచాలికి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిపెట్టిన విషయం మనకు తెలుసు. వనవాసి ద్వారా బిభూతిభూషణ్‌  తెలుగు పాఠకులకు మరింత చేరువ అయ్యారని చెప్పవచ్చు.  70 యేళ్ళ క్రితం వ్రాసిన పుస్తకమిది !.  అప్పటికీ ఇప్పటికీ వాతావరణ పరిస్థితులలో చాలా మార్పులొచ్చాయి. అయితే అడవులంత రించిపోతున్న వాస్తవం మనందరికీ తెలుసు. అభివృధ్ధి ముసుగులో అడవులు కనుమరుగవుతున్నాయన్నది చేదునిజం. దీని వల్ల అరణ్య ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే ఆదిమ జాతుల సంక్షేమం ప్రశ్నార్ధకమవుతోంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అత్యధిక ప్రజానీకానికి ఉపయోగపడకుండా పేద,బడుగు వర్గాలని నిరాశ్రయులను చేసే అభివృద్ధి అభివృద్ధి కాదు. ఈ దృష్టితో చూసినపుడు సాహిత్యంలో వనవాసీవంటి నవలల అవసరం అప్పటికంటే ఇప్పుడే ఎక్కువని చెప్పవచ్చు.
ఒక మహాద్భుతమయిన అనుభూతిని కలగజేసి, ఆ అనుభూతి తరంగాలలో పుస్తకం చదివిన చాలా రోజుల పాటు మనని ఓలలాడించే  ఒక అద్భుతమయిన పుస్తకం వనవాసి.  దీనికి బెంగాలీ మూలం అరణ్యక్‌  అనే నవల. తెలుగులో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. ఉద్యోగరీత్యా బీహార్‌ లోని ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళిన యువకుడు తనదుెరయిన అనుభవాలనుతను కనుగొన్న విషయాలను మనకు చెప్పే నవల ఇది.   నాగరికత ఎరుగని అరణ్య పరిసరాలలో ఆది వాసుల జీవనం, అరణ్య శోభ, ప్రకృతి ఆ యువకుడు నేర్చుకున్న పాఠాలు, అన్నీ మనోహరమయిన వర్ణనతో మన మనసుకు హత్తుకొంటాయి. కలకత్తా నగరంలో చదువు పూర్తి అయ్యాక బీహార్‌ ప్రాంతంలోని ఒక జమీందారీ ఎస్టేట్‌ అడవిలో మేనేజర్‌ గా చేరతాడు సత్యచరణ్‌. బీహార్‌ లోని పునియా జిల్లాలోని మహాలిఘారూప పర్వత శ్రేణి దిగువన ఉన్న మోహన్పురా అరణ్యప్రాంతమది. ఆ అరణ్యప్రాంతంలోని కొన్ని వేల భిగాల (బిఘా అంటే సుమారు 40 సెంట్లు నేల) నేలని పంటభూమిగా మార్చేందుకు కౌలుదారులను వెదికి కాస్త కాస్త చొప్పున ఆ నేలను వారికిచ్చి వారి నుండి శిస్తు వసూలు చేసే ఉద్యోగమది. ఉద్యోగంకోసం తప్పనిసరిపరిస్థితిలో కలకత్తాను వదిలి వెళ్ళిన సత్యచరణ్‌కు మొదట్లో ఆ నిర్జన అరణ్యం, ఆ నిశ్శబ్ద వాతావరణం ఊపిరాడనివ్వవు. ఏకాకినయిపోయాని మహాదుఃఖపడిపోతాడు.  వన్య మృగాల, బందిపోటు దొంగల భయానిప్పుెడూ వెంట తుపాకీ ఉంచుకోవాలని తెలిసి వణికిపోతాడు. పట్టణ వాతావరణం, సభ్య సమాజం, స్నేహితులు, పుస్తకాలు ఇవన్నీ వదిలి ఈ అనాగరిక ప్రపంచంలో ఆది వాసుల మధ్యన ఎలా ఉండాలో అర్ధంకా దతనికి.  మరుక్షణం ఉద్యోగం వదిలేసి పారిపోవాలనే తలంపుతోనే కొన్నాళ్ళు గడుపుతాడు. నౌకరీకి రాజీనామా ఇచ్చి, కలకత్తా వెళిపోయి, అక్కడ సంస్కారంకల బంధుమిత్రుల ఆదరం పొంది, సభ్య సమాజంలో మంచి తినుబండారాలు తిని, స్వర సంగీతాలు విని జనసమూహాల ఆనందోల్లాసభరిత కంఠస్వరాలు విని  ప్రాణాలు నిలుపుకుంటాను అంటాడు.  అయితే నెమ్మది నెమ్మదిగా మనోజ్ఞమయిన ఆ అరణ్య శోభ, సూర్యోదయాలు, సంధ్యా సమయాలు, చంద్రోదయాలు , వెన్నెల రాత్రులు, ఎత్తయిన వృక్షాలు  రకరకాల పక్షులు, గిరిజనుల అమాయకత్వం అతనిని సమ్మోహన పరిచి అడవికి దాసోహం చేసుకుంటాయి. ఏకాంత స్వేచ్ఛా జీవనంలో ఎంత సౌందర్యముందో రానురానూ ఆ అరణ్యం తననెలా సమ్మోహన పరిచిందో ప్రకృతితో పరిచయం ఎంతటి ఆనందాన్నివ్వగలదో అతను నెమ్మదిగా చెప్పుకుంటూ వస్తాడు.

ఆ అడవి సౌందర్యం అతనిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసినట్లే అక్కడి గిరిజనుల పేదరికూండా అతనికి దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అతడు సర్వేకి వస్తున్నాడని తెలిసి రెండు రోజులపాటు తిండి దొరుకుతుందనే ఆశతో మైళ్ళదూరం నడిచి వచ్చి పడిగాపులుకాస్తారు గిరిజనులు. అసలు అన్నం రూపమే తెలియని పేదరికంలో వాళ్ళుంటారు. ఈ నవలలో వేరు వేరు పాత్రల పరిచయం చేసే తీయీడా అద్భుతంగా ఉంటుంది. మటుక్నాథ్‌ పాండే మినప పిండి మూట కట్టుకుని మైళ్ళకు మైళ్ళు తిరిగీ తిరిగి, కచోరీ లో ఒకరిద్దరు శిష్యులకోసం బడి తెరిచి వారితో పాటు జీవనం సాగించే తీరూ,,  నిర్జనారణ్యంలో శీతాకాలపు రాత్రి చలిమంట ముందు అడవిదున్నల సంరక్షకుడు టాండ్బారో దేవత గాధ వినడం, న్చదీ కుటుంబమంతా కలిసి అప్పుడే వండిన జావ లాంటి పదార్ధాన్ని ఒ పాత్ర నుంచి తీసుకుని తినడం, బతుకుతెరువుకోసం 60 యేళ్ళ దశరధ్‌ అనే వృద్ధుడు చేసే చిన్ని కృష్ణుడి నాట్యం, ఆవ పంట చేతికొచ్చిన సమయంలో  పూల్కియా అడవిలో 15రోజులపాటు జరిగే సంతచేతికందిన చిన్న చిన్న మొత్తాని సంబరపడిపోయే అమాయక జీవులు.. ఒక చిన్న ఇత్తడి పాత్ర కొనుక్కోవడం కోసం సంవత్సరాలుగా కలలు కనే పేద మునీశ్వర్‌. ఈ పాత్రలన్నిటి సృష్టి చాలావాస్తవికంగా..మనసుకి హత్తుకునేట్లు ఉంటుంది.
ఈ కథ ద్వారా కథానాయకుడు  తనకు జరిగే అనుభవాలను మనకు వివరిస్తూ ఆ ప్రపంచంలోకి మనని తీసుకుపోతూంటాడు. ఒక పక్క అడవి అందాలకు ఆకర్షితుడవుతూనే మరొక పక్క ఉద్యోగ ధర్మం నిమిత్తం ఆ అడవినే కౌలుకివ్వవలసిరావడం, తద్వారా వృక్ష సంపదకి వినాశనం తెచ్చిపెట్టి ఆ పాపం మూట కట్టుకున్నాననే అపరాధ భావనతో అనుక్షణం జీవిస్తుంటాడు.. ఈ నవల ద్వారా అతని మానసిక స్థితిని రచయిత మనకళ్ళకు కడతాడు. మనిషి అడుగుపెట్టని దుర్గమారణ్యాన్ని, దాని సహజ సౌందర్య వైభవాన్ని, మధుర మార్దవాన్ని, సుకుమార దర్పాన్ని, ఏకాంత గంభీర స్వరూపాన్ని, భయంకరాకారాన్నీ అద్భుతంగా కన్నులకు కట్టినట్టు వర్ణించిన శబ్ద చిత్రణతో పుస్తకం అంతా నింపేస్తాడు. దూరాన ఎక్కడో కలకత్తాలో ఉన్న జమీందారు తరఫు ప్రతినిధి గా వచ్చిన ఈ యువకుని వద్దకు భూముల కోసం తహతహలాడుతూ వచ్చే అతి దీనమయిన ప్రజలూ, అంతటి దుర్భరజీవితం వలన వారికి కలిగిన వేదాంత తత్వం ఇవన్నీ చదువుతూంటే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ నవలలో ఉదహరించిన ప్రతీ స్వభావం మనకు చాలా సహజంగా అనిపిస్తుంది. నాగరికత కి దూరంగా ఉండడం వలన వారందరిలోనూ ఆదిమానవ సహజమయిన నిష్కపట సరళ స్వభావం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇందులోని పాత్రలగురించి చదువుతున్న మనకు మనం చూసిన పల్లెలలోని వేరు వేరు వ్యక్తులు గుర్తుకు రాక మానరు.
పుస్తకం చదువుతున్నసేపూ మనకు తెలియని ఒక భయంకరమయిన నిరుపేద ప్రపంచం ఇంకొకటుంది అని తెలుసుకుంటున్న మన మనసు చలించిపోతూ ఉంటుంది. వేలం మినుములు, జొన్న పిండి ముద్దలు తిని బ్రతి నిరుపేద ఆదివాసీలు,,   చీనాగడ్డి  గింజల పప్పులో ఉప్పు వేసుకుని బ్రతివాేరు, అడవిలో దొరి పుచ్చకాయలలాంటి పళ్ళు తిని నెలలు గడిపే పేద వాళ్ళు, ూరలు పండించి వాటిలోకి అడవి తోటూర వండి పప్పు నంచుకొని తినే వారూ అక్కడ ఉన్నారని తెలిసాక నాగరిక జనావాసాలకు దూరంగా ఇంతటి నికృష్ట దారిద్య్రాన్ని అనుభవించే ప్రజలున్నారా అని మనం బాధపడతాం. వారిపై అవ్యాజమయిన ప్రేమ కలుగుతూంటుంది. ఏదో ఒక విధంగా వాళ్ళకు సాయం చేయాలని మన మనసు కొట్టుకుంటుంది. ఆ గిరిజనుల అమాయకత్వం, వారి ఆకలి కష్టాలు మనకు తెలియకుండానే మనలో ఉన్న కరుణని జాగ్రత్త చేస్తాయి. నవలలో సత్యచరణ్‌ ూడా ఉద్యోగ రీత్యా ఉండవలిసిన విధంగా ఉంటూనే తనకు తోచిన సహాయాన్నీ చేస్తూ ఉంటాడు. తన స్థాయిలో వారికి ప్రేమని పంచిపెడుతూంటాడు. వారికి అప్పుడప్పుడు పిలిచి భోజనం పెడుతూంటాడు. అలాగే మరీ నిరుపేద రైతులనిపించినవారికి తన విచక్షణ నుపయోగించి కౌలు విషయం లో కొన్ని కొన్ని మినహాయింపులు ూడా ఇస్తూంటాడు.
రచయిత ఎంత ప్రకృతి ఆరాధకుడో చెప్పకపోతే ఈ పుస్తక పరిచయం అసమగ్రమే. అతడిలోని భావుకత మనల్ని పుస్తకం చదివేటప్పుడూ చదివాక ూడ మనల్ని మత్తులో ముంచెత్తుతుంది. వసంత పూర్ణిమ రాత్రి వెన్నెల్లో గుర్రం మీద సత్యచరణ్‌ ని తీసుళ్తూె.. రచయిత చెసే వర్ణన అయితే అద్భుతం.. మన మనసూ శరీరం ూడ ఆ అనుభవం పొందుతాయంటే అతిశయోక్తి కాదు.
మనలో చాలా మంది ప్రకృతి ఆరాధకులు ఉంటూనే ఉంటారు. ప్రకృతి మాత పవిత్ర ప్రాంగణం మీద నానాటికి విజృంభిస్తున్న ఆధునిక నాగరికత వల్ల చెట్లు అడవులు.. జలజలా పారే సెలయేరులూ ఇవన్నీ మనకు అరుదైన సంతోషాలుగా మిగిలిపోతున్నాయి. అందు ఈ ప్రకృతి ప్రేమికులు తమ అనుభూతుల్ని పంచుకోవడంలో విపరీతమైన ఆత్మీయత మనకి కనిపిస్తుంది. అయితే వీటన్నిటికీ మించినదీ, అతీతమైనదీ ఏదో బిభూతి భూషణ్‌  రచనలో మనకి కనిపిస్తుంది. అతను చెప్తున్న విషయాలూ.. చేస్తున్న వర్ణనలూ.. సత్యచరణ్‌ పాత్ర అనుభవించే క్షోభ.. ఇవన్నీ మన మనసులోంచి, మన ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చినట్లు అనిపిస్తుంది.
తనకప్పగించిన పని అయిపోయిన తరువాత అడవిని వదిలిపెట్టి చివరకి సత్యచరణ్‌ కలకత్తా చేరడంతో నవల ముగుస్తుంది. తనకు అప్పజెప్పిన పని విజయవంతంగా చేసినా ూడా తన వల్ల ఆ అరణ్యం నశించిపోయినదన్న అపరాధ భావన అతని వదలదు. అరణ్య దేవతను క్షమించమని కోరుతూ ఆ ప్రాంతాన్ని వీడుతాడు సత్యచరణ్‌. అరణ్యాలన్నీ ఆధునీకరణకు ఆహుతయిపోతున్న ప్రస్తుత తరుణంలో పర్యావరణకై ఇటువంటి హృద్యమయిన రచనలు చదవాల్సిన అవసరం ఎంతయినా ఉందనిపిస్తుంది మనకి ఈ నవల చదువుతుంటే. ఒక నిర్జనారణ్య ప్రాంతంలో పరమ సౌందర్య భరితమయిన ప్రకృతి ఒడిలో సాధారణ మానవుడు ఏం నేర్చుకోగలడు ? అతని వ్యక్తిత్వం ఎంత ఉత్కృష్టంగా మారగలదు? ఎంత లోతయిన జీవిత సత్యాలను నేర్వగలదో తెలపగల పాత్ర సత్యచరణ్‌ది, అంతే కాక నవల చదివిన చాలా కాలం మన ఆలోచనలో తిరుగాడే దుదులీ పుష్పాల మధురవాసనలు, రక్తఫలాశ వృక్షాల శోభ, పత్రవిహీ నమయిన గొల్గొలీ పువ్వులు, వెన్నెల రాత్రులు, సెలయేటిలో అడవిలిల్లీల మృదుమధుర పరిమళాలతో పాటుగా వీటన్నిటినీ తన ఏకాంత స్వేచ్చా విహారాలలో అనుభూతి స్వప్నాలు గా మలుచుకున్న అదృష్టవంతుడిగా సత్యచరణ్‌ మనప్పెటికీ గుర్తుండిపోతాడు.
పుస్తకం చదివి మూసేసిన తరువాత ూడా అడవి జ్ఞాపకాలు మనని ఒదిలిపెట్టకుండా వేధిస్తూ ఉంటాయి.  అడవుల మనుగడ..  వాటి మీద ఆధారపడి బ్రతి ఆదిమజాతుల మనుగడ, కరువయిపోతున్న ప్రాణవాయువు, పచ్చదనం వీటన్నిటిగురించీ రచయిత ఎక్కడా మనతో మాటాడినట్టే ఉండదు. కథానాయకుడు సత్యచరణ్‌ ూడా వీటన్నిటిగురించీ ఎక్కడా ఉపన్యాసలిస్తున్నట్లుగా అనిపించదు. మనల్ని ప్రశ్నిస్తున్నట్లుగా ూడా అనిపించదు. కాని ఆ పని మనతో చేయిస్తాడు. ఆ ప్రశ్న మనల్ని మనమే వేసుకునేలా చేస్తాడు. అడవులు అంతరించిపోతే? అనే ప్రశ్న పుస్తకం చదువుతున్నంతసేపూ మన మనసులో మెదిలి పుస్తకం పూర్తయిన తరువాత పెద్ద చిక్కుముడిలా మన ముందు నిలుస్తుంది. పీడకలయి మనని భయపెడుతుంది. చివరికి పుస్తకంలో పాత్రయిన..   కుంటా, భన్వారీ, భానుమతి, రాజూ పాండే, వీళ్ళందరికీ మనని దత్తతిచ్చేసిన సత్యచరణ్‌ తను మాత్రం మాయమయిపోయినట్టు మనసుకి  అనిపిస్తుంది. అద్భుతమయిన సన్నివేశాలూ, అపూర్వమయిన వన సౌందర్య వర్ణనలూ ఆదివాసీల దుర్భర దారిద్య్రం ప్రతీ పేజీలోను మనకు కనపడతాయి.
ఈ పుస్తకం చదవాలంటే వేలం పుస్తకం చదవాలన్న ఆసక్తి చాలదు. తరవాత వెంటాడే వ్యథార్ధ జీవిత యదార్ధ దృశ్యాలూ, అడవుల మనుగడపట్ల రేపే ఆలోచనలూ , మనసంతా ఆక్రమించే ఆదివాసీ పాత్రలూ, అన్నానికీ రొట్టెలూ ూడా నోచుకోక గడ్డిగింజలే పప్పు గా భావించి తినే దృశ్యాలూ ఒక్క రొట్టె ముక్క కోసం పదుల మైళ్ళు నడిచి వచ్చే పేదలూ, వారిని దోచే భూస్వాములూ వీటన్నింటినీ భరించే శక్తి మనకుండాలి.
ఒక నిర్జనారణ్య ప్రాంతంలో పరమ సౌందర్యభరితమైన ప్రకృతి వడిలో ఒక సాధారణ మానవుడు ఏం నేర్చుకోగలడుఅతని వ్యక్తిత్వం పై ప్రకృతి చూపించగల ప్రభావం ఇవన్నీ మనకి తెలియచెప్పే పుస్తకం వనవాసి. పుస్తకం ఆద్యంతమూ ఎంత ప్రభావశీలం గా ఉంటుందంటే.. సత్యచరణ్‌ తన ఉద్యోగ బాధ్యత పూర్తి అయ్యాక తిరిగి కలకత్తా వెళ్తుంటే మన మనసు ఆక్రోశ పడుతుంది. అడవినీ.. అమాయకత్వాన్నీ.. మనకి అప్పచెప్పేసి ఇతను ఎక్కడికి వెళిపోతున్నాడూ అని మనం ఉక్రోషపడి పోతాం.. అంత వాస్తవికత ఉంటుంది ఈ పుస్తకం లో. ముఖ్యంగాదిగంత పరివ్యాప్తమైన విస్తృతారణ్యం..ఎండలో కాలిన మట్టిలోనుంచి లేచే పరిమళం.. అడవిపూల సుగంధం.. అడవితల్లి మనకి ఇచ్చే స్వేచ్చా జీవితం.. ఇవన్నీ ఆస్వాదించా లంటే వనవాసి తప్పక చదవాల్సిందే.

No comments