సయొనారా..


సయొనారా...సయొనారా
వాదా నిభావుంగీ సయొనారా
 
కల్ ఫిర్ ఆవూంగీ సయొనారా
సంధ్య మసకలో అందరూ ఇళ్ళకి వెళ్ళారు 
బాట పంచన కూర్చుని
 
పడవని నడుపుకుంటూ పోయే
 
అతని కోసం చూస్తోంది ఆమె..
దూరంగా తెరచాప మీద 
సూర్యాస్తమయ రేఖ మెరుస్తోంది!!
నల్లని నీటిని దాటుతూ
 
చుక్కాని పట్టుకుని వెళుతున్న
 
అతని ఆకారం వంక చూస్తూ నిలబడిందామె..
ఆమె మనసు పాడుతోంది సన్నగా
సయొనారా...సయొనారా
వాదా నిభావుంగీ సయొనారా ...
ఆమెపై నిలచిన అతని చూపు 
తన కంటబడి
 
ఒక్క సారి పాట ఆపి
 
మళ్ళీ పిలిచిందామె,


కల్ ఫిర్ ఆవూంగీ సయొనారా..
వాదా నిభావుంగీ సయొనారా..



No comments