ది విన్నర్ స్టాండ్స్ ఎలోన్!!

కొండల్ని దాటి.. 
కోనల్ని దాటి..
నిచ్చెనపై నిచ్చెనలేసి..
మాయా బజార్ల వాకిళ్ళు తెరిచి..
కొత్త యుగాన్ని కలగంటూ..
"నే చేరుకోవాలనుకొన్న
బంగారు సామ్రాజ్యం..
అదిగో అల్లంత దూరంలో ఉంది
వేయికాళ్ళ బంధనాలతో
ఎందుకిలా కట్టేస్తున్నావని..."
వగరుస్తూ...
చేయి విదిలిస్తూ..
అతను అన్నప్పుడు...
ఆమె మనసు ఇలా అంది..
నేస్తం!!
ఒక్క సారి ఆగి
 
నా కళ్ళలోకి చూడూ..
నువ్వనుకున్న సామ్రాజ్యం..
నువ్వు ఎక్కిన మెట్లు..
నువ్వు ప్రోగు చేసిన సంపద
కొనలేని విలువైన ప్రేమ
ఇక్కడ ఉందీ..
అన్నీ గెలిచిన నీకు
నన్ను ఓడిపోయానని
 
ఎప్పటికి అర్ధం అవుతుందీ???

No comments