ఒక నువ్వూ ఒక నేనూ ఒక నవ్వూ… ఒక తడి వర్షం


జ్ఞాపకమంటే
 
మర్చిపోయామనుకున్న జీవితం
 
మరలా జీవించమని మన ముందుకి రావడం
జ్ఞాపకమంటే 
చిన్నప్పుడు తడికె చాటున దాగుడు మూతలాడిన మన నేస్తం
 
మరలా కళ్ళు మూసి బుగ్గగిల్లి
 
ఇదిగో ఇక్కడున్నా అంటూ మన ముందుకి రావడం
జ్ఞాపకమంటే 
ప్రస్తుతాన్ని మరచిపోయి
 
గతమనే గులాబీ తోటలోకి ఆగకుండా పరిగెత్తడం
జ్ఞాపకమంటే 
వదలలేని చోటుని కదిలి పోయిన వేళలనీ
 
ఇష్టంగా తడుముకోవటం
జ్ఞాపకమంటే 
కొన్ని పసి పదాల సవ్వడి
 
కొన్ని పచ్చని నవ్వుల అలికిడి
జ్ఞాపకమంటే 
పసితనపు పచ్చి వాసన
మనసు తడుముకునే వెన్నెల వీవన
జ్ఞాపకమంటే 
ఒక నువ్వూ ఒక నేనూ
 
ఒక నవ్వూ
ఒక తడి వర్షం


No comments