యాగం


ఒక్క మాట.. ఒకే ఒక్క మాట
సముద్రమంత మనిషి గుండెలో
ఎంత సునామీ సృష్టిస్తుంది??
ఒక్క తిరస్కారం.. ఒకే ఒక్క తిరస్కారం
మనసు రిక్టర్ స్కేల్‌ని
ఎంత ఛిద్రం చేస్తుంది
నిజం
మహా సంక్షోభానికి
మహా విపత్తే అక్కరలేదు
ఒక్క కణం కన్నెర్ర చాలు
భూగోళమంత వేదనకి
మహాసాగరమే అక్కర్లేదు
రెప్పదాటిన ఒక కన్నీటి చుక్క చాలు
సరిహద్దులుగా ఘనీభవించిన నమ్మకాలని
తెలిమంచులా కరిగించే మూర్ఖత్వమొకటి
ఎందుకూ పనికి రాదు
అప్పటికప్పుడు
కొన్ని సున్నితత్వాలని అదృశ్యం చెయ్యటం తప్ప
చెంపను తడిమిన ప్రతి కన్నీటి చుక్కకూ
రోషాన్నద్దుకోవటం నేర్పుకున్నాక
మది మహార్ణవపు ప్రళయభీబత్సం
పరిచయమవ్వటమే కాదు
సర్పయాగం పరిపూర్ణమవ్వటమూ తథ్యమే

No comments