తను
తను
నా కనురెప్పల వాలున కాపలాగా ఉంటాడు
చెమరింతలన్నిటినీ చెలిమి చివరన కట్టేస్తూ
గుండె సవ్వడిలో రాగం తీస్తూ ఉంటాడు
గాయాలన్నిటినీ అనురాగంతో మాన్పివేస్తూ
నా కలలకి రూపమివ్వటానికి నిండుగా నాలోకొచ్చేసాడు.
ఇంతలా దగ్గరకొచ్చేసాక
నాలో నేనెక్కడో తనకి నేనెక్కడో… అంతా సందిగ్ధమే
నాకు తెలిసిన నిజమొక్కటే
తను నాలో నిండి పోయిన ఆరారు ఋతువుల వసంతమని ...
నాలో నేనెక్కడో తనకి నేనెక్కడో… అంతా సందిగ్ధమే
నాకు తెలిసిన నిజమొక్కటే
తను నాలో నిండి పోయిన ఆరారు ఋతువుల వసంతమని ...
అప్పుడప్పుడూ
నాలో శూన్యమై ఘనీభవిస్తున్న తన ఉనికి చూస్తుంటే
భయమేస్తుంది
చాలా భయమేస్తుంది
నాలో నుండి తను కొల్లగొట్టబడతాడేమో అన్నంత భయం
ఆపలేని అసహాయతలేవో
క్షణాలుగా మమ్మల్ని ముంచేస్తాయేమోనన్నంత వేదన
నాలో చీకటికి చెమ్మలద్దుతుంది

అయితేనేం
నాకు తెలుసు
తను చీకటి రాళ్ళతో నిప్పు రాజేసి
నాలో వెలుగుని ప్రజ్వలిస్తాడని.
నాకు తెలుసు
తను చీకటి రాళ్ళతో నిప్పు రాజేసి
నాలో వెలుగుని ప్రజ్వలిస్తాడని.
Post a Comment