కన్నీటి శిబిరం

దీపమెళ్ళిపోయాక అలుముకున్న చీకటిలా
ముసురుకుంటాయి నీ జ్ఞాపకాలు!!
అయినా.. ఈ రాత్రెప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.
మనసుని తొలిచే జ్ఞాపకాల ధ్వని..
ఆలోచనలకు రెక్కలు తొడగకా మానదు.!!
మిత్రమా...
ఇప్పటికెన్ని ఆలోచనలు,
 
గాజుబొమ్మల్లా పగిలిపోయాయో
రాత్రిని పరిశోధిస్తున్న మిణుగుర్లకే తెలుసు...!
తెల్లారి చూస్తే..
జ్ఞాపకాలు జాడను కోల్పోయినట్లే అనిపిస్తుంది.
అద్దానికి ముఖాన్ని చూపగానే,
చెక్కిలి మీద నీ జ్ఞాపకం
మళ్ళీ ఆలోచనల్ని లేపి,
నన్నొక కన్నీటి శిబిరాన్ని చేస్తుంది...

-      20.12.15

No comments