పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్నా...


కలల ప్రవాహమొకటి 
నిలువెత్తు ఆనందమై స్పర్శించి నప్పుడు తెలిసింది
 
రక్త బంధమొకటి వాస్తవంలో నన్నల్లుకుపోయిందని
నా చిటికెనవేలు ఆసరాతో ఎదిగిన పసితనమొకటి 
ఇప్పుడు ప్రపంచాన్ని తన కళ్ళతో నాకు పరిచయం చేస్తుంటే..
మురిపెమొకటి మనసంతా నిండిపోతుంది

అమ్మకే అమ్మలా మారిపోవాలన్నంత తపన 
తన ప్రేమలో కనిపిస్తుంటే
 
నా పెదవులపై చెదిరిపోని నవ్వుకి ఒక భరోసా దొరికేసింది
 
***
నాన్నా!!!
నా కలల రహదారిలో నువ్వొక నడిచే నక్షత్రానివి
 
అలుపెరుగని నా చిరునవ్వుల నడకవి నువ్వు..

No comments