ఒక జ్ఞాపకం


తన తలపులతో
కాలపు నావలో ప్రయాణం
అలలెక్కడా లేవు...
అన్నీ అనుభూతులే!!
నిలువెల్లా ముంచేస్తున్న
తన అసంతృప్తపు నీడ
అక్షరాలని అలుముకుంటోంది.
ఇప్పుడే తను వెళ్ళాడని
ఇటు వస్తున్న పరిమళం చెప్తోంది!!
అంతే!!
తనంతే వెళ్తాడు.
నిశ్శబ్దాన్ని నాలో రగిల్చి.
కానీ,
తన తలపులు మిగిల్చిన
విషాదం మాత్రం నాతోనే!


No comments