I AM LOST.. WANNA DIE


అప్పుడప్పుడూ అంతే!!
మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న
పారిజాతం...
బోగన్ విల్లా కొమ్మలా
రూపం ఉండీ, పరిమళం లేనిదవుతుంది!
అప్పుడప్పుడూ అంతే!!
ఉదయం అవుతుంది గానీ,
సూర్యుడు రాడు.
నిద్రొస్తుంది,
స్వప్నం రాదు...
ఖాళీతనం అంటే
ఉండీ లేకపోవడం..
బతికుండీ మరణించడం..
అప్పుడప్పుడూ అంతే...
నిస్సహాయత్వం.. బతుకుని
అస్తవ్యస్తం చేస్తుంది..
అస్తవ్యస్తంగా జీవించడం కంటే..
అర్ధవంతంగా మరణించడం..
నయం అనిపిస్తుంది.

No comments