నీడను కూడా వదిలి
చీకట్లో... ఒంటరితనం
నిండిన మనసుతో..
ఆమె.
నిశ్శబ్దంలో
మిణుగురుల నేరుకుంటూ
అలసి సొలసి
కీచురాళ్ళయిన
ఆమె ఆలొచనలూ...
బరువెక్కిన
మనసు లోపల
నిశిరాత్రిలో
నిశ్శబ్దంగా
బందీలయ్యాయి!!
మెలకువలోకొచ్చాక
రంగులద్దుకున్న రాత్రి
నీడను తోడిచ్చి
మళ్ళీ నడవమంది.
ఎదురుచూపులో
మళ్ళీ ఒక రోజు.
Post a Comment