నేను- సముద్రం
సముద్రం నా అవ్యక్త అక్షరం.
సముద్రం నా మనసు పాడే మౌనగీతం..
సముద్రం ఆటుపోట్లలో
ప్రతీ అలా, కలా, కలతా
నా మనసే!
అందుకే ఇప్పుడు..
బతుకు పోరును
సముద్రం హోరులో...
బతుకు లోతును
సముద్ర గర్భంలో..
బతుకు రీతినీ,
అందులో వైవిధ్యాన్నీ..
సముద్ర కెరటంలో నేర్చుకుంటున్నా!!
ఇప్పుడు,
సముద్రం స్వేచ్ఛలో,
నా స్వేచ్ఛని వెతుక్కుంటున్నా..
బతుకు పోరును
సముద్రం హోరులో...
బతుకు లోతును
సముద్ర గర్భంలో..
బతుకు రీతినీ,
అందులో వైవిధ్యాన్నీ..
సముద్ర కెరటంలో నేర్చుకుంటున్నా!!
ఇప్పుడు,
సముద్రం స్వేచ్ఛలో,
నా స్వేచ్ఛని వెతుక్కుంటున్నా..
~~ మహీ ~~
29.09.2015
29.09.2015
Post a Comment