ఓ చినుకు తననీ నన్నూ తడిపిన వేళ పారిజాత స్పర్శ లాంటి చలచల్లని గీతమేదో బంధాల సంగీతఝురికి అలవోకగా తీసుకెళ్ళినప్పుడు పదం పధంగా మమకారం పల్లవించిన ఒక ప్రయాణం.. ఎప్పటికీ అలసిపోని గోదారి ప్రవాహం!!!
ఎప్పుడైనా బంధం పొడిబారి ముడుచుకుపోతూ, విడిపోతూ మనసుని గాయపరుస్తున్న వేళ తను విసిరిన మలిచినుకుతో బద్దలైన మౌనం.. గోదారమ్మ సాక్షిగా చీల్చుకొచ్చే కొత్త చిగుర్లు... అంతులేని ప్రవాహంలా ఇద్దరి ప్రస్థానం మరో గీతానికి పల్లవి!!
Post a Comment