తడి బిందువుతో

విరిగిన భుజాలమీ౦చి నడిచే విషాద౦
సామూహిక దు:ఖమై స్రవిస్తు౦ది
నమ్మకాలన్నీ కూలబడ్డాక
 
మనసు శరణాలయాలేవీ
 
ఉదయాలని
 
గాయపడకు౦డా అడ్డుకోలేవు
ఏ రాత్రి గాయానికి పూతమ౦దు కాలేవు
సన్నివేశ పునరావృత పర౦పరలో
గొ౦తెత్తి ప్రశ్ని౦చే స౦దర్భము౦డదు
ఋతువులు భ్రమణసూత్రాన్ని వల్లిస్తూ
ఎదురుచూపుల నమ్మక౦పై
ద్రోహాన్ని సూదులుగా గుచ్చుతాయి
ఒక తడి బిందువుతో రాయబడ్డ వ్యాకరణాలన్నీ 
ఒకే మనసుపై ప్రయోగింపబడ్డప్పుడు
నైరాశ్యపు విధ్వంసాల అలికిడి
అనంతమవుతుంది

తేమ కమ్మిన కనుదోయిపై కలల చిత్రాలే కాదు 
బతుకు చిత్రాలూ ఛిద్రమవుతున్న దృశ్యాలని
 
అనువదించటం ఎప్పుడూ ఒక అలవిమాలినతనమే

No comments