సహారా


గుండె నిండా సహారా పరచుకున్న
పొడిదనంలో ఆవిరైన
 
వాన అలజడి ఒకటి
 
ఇక్కడ నా కళ్ళల్లో చోటు వెదుక్కుంది
తృష్ణ తీరని చీకటేమో 
నా మనో వేదిక పైనే
 
తన క్షణాల
 
నర్తనాపాటవాన్ని ప్రదర్శిస్తుంది
ఇంతలో ఏ వైపు నుండో 
ఆది ప్రణవంలా
 
మృదు మధురంగా నీ మహత్తర శబ్ద స్పర్శ

రెక్కలపై రంగుల చిత్రమద్దుకున్న 
అందాల సీతాకోకచిలుకా
ఒకప్పుడు గొంగళిపురుగేనంటూ

No comments