ఉషోదయం
అతనంటాడూ....
"ఇంతే! ఇంకేమీ లేదు" అని.
తీరంతాకే కెరటాలని చూస్తుందామె మౌనంగా..
పడిలేచే కెరటాల గమ్యం తన
మనసుకి తప్ప ఎవరికి తెలుసు!!
"ఇంతే! ఇంకేమీ లేదు" అని.
తీరంతాకే కెరటాలని చూస్తుందామె మౌనంగా..
పడిలేచే కెరటాల గమ్యం తన
మనసుకి తప్ప ఎవరికి తెలుసు!!
"ఇక ముందూ ఏమీ ఉండదు"
మరలా అంటాడతను
పడమట కుంగుతున్న సూర్యుడిని
నవ్వుతూ చూస్తూ... ఆమె
రేపటి ఉషోదయం ఇచ్చే ధైర్యం
ఆమెకి కాక ఎవరికి తెలుసు!!
మరలా అంటాడతను
పడమట కుంగుతున్న సూర్యుడిని
నవ్వుతూ చూస్తూ... ఆమె
రేపటి ఉషోదయం ఇచ్చే ధైర్యం
ఆమెకి కాక ఎవరికి తెలుసు!!
"ఇక వెళ్తా" అంటాడతను..
ఏ జాడా లేకుండా..
కనీసం స్మృతి సమీరాన్నయినా మిగల్చకుండా...
నీరెండలో సగం తడిచి
రాలడానికి సిద్ధంగా ఉన్న
పండుటాకుల్ని చూస్తోందామె,
వెనుక దాక్కొన్న లేచివుర్ల సాక్షిగా!!
ఏ జాడా లేకుండా..
కనీసం స్మృతి సమీరాన్నయినా మిగల్చకుండా...
నీరెండలో సగం తడిచి
రాలడానికి సిద్ధంగా ఉన్న
పండుటాకుల్ని చూస్తోందామె,
వెనుక దాక్కొన్న లేచివుర్ల సాక్షిగా!!
చీకటి సద్దు మణిగాక
దీపపు కాంతీ మందగించాక..
బయట వర్షపు రాత్రిలో ఇక రాల లేక
ఒక చినుకు
ఉగ్గబట్టుకు చూస్తోందామెను..
దీపపు కాంతీ మందగించాక..
బయట వర్షపు రాత్రిలో ఇక రాల లేక
ఒక చినుకు
ఉగ్గబట్టుకు చూస్తోందామెను..
ఊడ్చుకుపోయిన క్షణాల గురించి ఆలోచన లేదిప్పుడు...
ఆమెకి తెలుసు
జీవితం ఒక్క క్షణంతోనే మొదలవుతుందని.
ఆమెకి తెలుసు
జీవితం ఒక్క క్షణంతోనే మొదలవుతుందని.
Post a Comment