నువ్వు.. నేను


అలసి సొలసి ఇలా పయనిస్తూ
అడుగు అడుగునా మరణిస్తూ
జీవనపోరాటం చేస్తున్న వేళ
ఓటమిలో తోడుగా
చిరునవ్వుల జాడగా
నా వెనువెంటే వచ్చావు
నాకు నీ ప్రేమ పంచావు
గెలవాలనే తపన పెంచావు
కర్ణకఠోరంగా స్వరిస్తున్న నా జీవితాన్ని 
శ్రావ్యంగా మార్చెయ్యటానికి
నువ్వు పడుతున్న తపనలో
నాకంటూ ఓ కొత్త ఉగాదిని ఇవ్వాలనే తాపత్రయం
 
నన్ను నాకు తిరిగిచ్చింది.
ఉదయమే మనసు తలుపుని సున్నితంగా తట్టి 
హృదయంలోకి అందంగా అడుగేసే నీ ఆలోచనలు...
ఏయ్
జీవితం కొత్త వర్ణాలద్దుకుందిప్పుడు 
అన్ని వర్ణాలూ నువ్వైన కాలసంధిని పరిచయిస్తూ
అప్పుడప్పుడూ నువ్వు అమ్మవుతావ్
మరొకప్పుడు నాన్నవవుతావ్
 
ఎప్పటికీ నువ్వు నేనైపోతావ్
 
మరి నాకు తెలిసిన ఏకైక ప్రవాహానివి నువ్వు

ఇప్పుడిక నిజంగా 
మన చేతులిలా చాలా దూరం నడవాల్సి ఉంది
 
బహుశా కొన్ని యుగాలు
!


No comments